ఒలింపిక్స్‌ ఆడడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్‌ ఆడడమే లక్ష్యం

Published Fri, Feb 21 2025 8:26 AM | Last Updated on Fri, Feb 21 2025 8:22 AM

ఒలింప

ఒలింపిక్స్‌ ఆడడమే లక్ష్యం

ఆదిలాబాద్‌: దేశంలో సంప్రదాయ క్రీడ అయిన ఖోఖో ప్రస్తుతం ఆదరణ చూరగొంటోంది. ఈ క్రీడ నేడు వరల్డ్‌ కప్‌ స్థాయికి ఎదిగింది. ఢిల్లీలో జరిగిన తొలి వరల్డ్‌కప్‌లో పురుషులు, మహిళల జట్లు జగజ్జేతలుగా నిలవడం విశేషం. పురుషుల జట్టుకు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏకై క క్రీడాకారుడు పోతిరెడ్డి శివారెడ్డి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్ర కాశం జిల్లాకు చెందిన ఈయన ప్రస్తుతం ఆది లాబాద్‌ హెడ్‌ పోస్టాఫీసులో పోస్టల్‌ అసిస్టెంట్‌గా వి ధులు నిర్వహిస్తున్నాడు. ఓవైపు విఽధులు నిర్వహి స్తూనే, మరోవైపు నిత్యం సాధన చేసి జాతీయ జ ట్టుకు ఎంపికై ఖోఖోలో వరల్డ్‌ కప్‌ టీం సభ్యుడిగా ఫైనల్లో సత్తా చాటాడు. జట్టు ఛాంపియన్‌గా అవతరించడంలో కీలకంగా వ్యవహరించాడు. ఒలింపిక్స్‌ ఆడడమే తన లక్ష్యమని చెబుతున్న శివారెడ్డితో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.

సాక్షి: ఖోఖోపై ఇష్టం ఎలా ఏర్పడింది?

శివారెడ్డి: మా ప్రాంతంలో ఖోఖో ఎక్కువగా ఆడేవా రు. మా ఈదర గ్రామంలోని పాఠశాలలో వ్యా యామ ఉపాధ్యాయుడు కాశీ విశ్వనాథరెడ్డి అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు. నాతోపాటు ఎంతో మంది క్రీడాకారులకు శిక్షణ అందించారు. పాఠశాలలో ఉన్నప్పుడే 2006 నుంచి ఖోఖోపై ఇష్టం పెరిగింది. అప్పటి నుంచి ఆట ఆడుతున్నాను.

సాక్షి:ఎవరుప్రోత్సహించారు?శిక్షణ ఎలా సాగింది?

శివారెడ్డి: తల్లిదండ్రులు కోటేశ్వరమ్మ–గురువారెడ్డి. తమ్ముడు పరమేశ్వర్‌రెడ్డి ప్రోత్సహించారు. నా ప్రతిభను గుర్తించి వ్యాయామ ఉపాధ్యాయుడు కాశీ విశ్వనాథరెడ్డి బాపట్ల జిల్లా పుంగలూరు ఎస్‌.ఆర్‌ అకాడమీలో చేర్పించారు. శిక్షకుడు సీతారామరెడ్డి మెలకువలు నేర్పారు. 2009లో చేరి 16 ఏళ్లపాటు శిక్షణ తీసుకుని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించాను.

సాక్షి: ఎన్ని పోటీల్లో పాల్గొన్నారు?

శివారెడ్డి: 35 జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. 2010లో ఎస్జీఎఫ్‌ అండర్‌–17 విభాగంలో ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ఆడాను. 2022లో అల్టిమేట్‌ ఖోఖో లీగ్‌లో గుజరాత్‌ జట్టు, 2024లో ముంబై జట్టులో సభ్యుడిగా ఉన్నా. 2018లో లండన్‌ వేదికగా జరిగిన పోటీల్లో ఇంగ్లాండ్‌ జట్టుపై ఆడి గోల్డ్‌ మెడల్‌ సాధించాం. ఇందులో బెస్ట్‌ చేజర్‌గా నిలిచాను. ఇటీవల జనవరి 13 నుంచి 19వ తేదీ వరకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన ఖోఖో వరల్డ్‌ కప్‌లో నేపాల్‌ జట్టుపైనే గెలిచి ఛాంపియనిషిప్‌ సాధించడం ఆనందంగా ఉంది. నేపాల్‌తో జరిగిన తొలిమ్యాచ్‌లో బెస్ట్‌ అటాకర్‌గా నిలిచాను.

సాక్షి:పోస్టల్‌లో ఉద్యోగం ఎప్పుడు సాధించారు?

శివారెడ్డి: 2022 సెప్టెంబర్‌లో స్పోర్ట్స్‌ కోటాలో పోస్టల్‌ అసిస్టెంట్‌ గా ఉద్యోగం సాధించి, ఆదిలాబాద్‌ హెడ్‌ పోస్టాఫీస్‌లో జాయిన్‌ అయ్యాను. రూమ్‌మేట్‌ అంతర్జాతీయ క్రీడాకారుడు అయిన రంజిత్‌ సమక్షంలో ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ కళాశాల మైదానంలో ప్రతీరోజు సాధన కొనసాగిస్తున్నాను.

సాక్షి: జాతీయ జట్టుకు ఎంపిక ఎలా జరిగింది?

శివారెడ్డి: 2023 ఏప్రిల్‌ ఢిల్లీ వేదికగా సీనియర్‌ నేషనల్‌ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని వివిధ రాష్ట్రాల నుంచి పురుషులు, మహిళల జట్లకు 60 మందిని ఎంపిక చేశారు. 2024 డిసెంబర్‌లో ప్రత్యేక శిక్షణ శిబిరంలో నైపుణ్యాలు ప్రదర్శించిన తనతోపాటు పలువురిని జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. 23 దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులతో తలపడి విజేతలుగా నిలవడం సంతోషాన్నిచ్చింది.

సాక్షి: దేశంలో క్రికెట్‌కు ఆదరణ ఉందంటారా?

శివారెడ్డి: దేశంలో క్రికెట్‌కు ఆదరణ ఉంది. మిగతా క్రీడలనూ ఆదరించాలి. గతంతో కన్నా కబడ్డీ, ఖోఖో క్రీడల పట్ల ఆదరణ పెరుగుతోంది. క్రీడాకారులను ప్రోత్సహిస్తే పతకాలు సాధిస్తారు.

సాక్షి: ఎలాంటి ప్రోత్సాహం కోరుకుంటున్నారు?

శివారెడ్డి: మహారాష్ట్ర నుంచి వరల్డ్‌ కప్‌లో సుమారు 9 మంది జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఐదుగురు పురుషుల జట్టు, నలుగురు మహిళల జట్టులో ఆడారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.2.25 కోట్ల నజరానా ప్రకటించడంతోపాటు గ్రూప్‌–1 పోస్టింగ్‌ ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి నేను జాతీయ జట్టుకు ఆడాను. క్రీడా సంఘాలు, ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే ఎన్నో క్రీడారత్నాలు వెలుగులోకి వస్తాయి.

సాక్షి: యువతకు మీరిచ్చే సందేశం?

శివారెడ్డి: క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ప్రత్యేక రిజర్వేషన్‌ కేటాయించారు. చిన్ననాటి నుంచే పిల్లలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. మైదానాల్లో శ్రమిస్తేనే వారిలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుంది. యువత క్రీడా రంగాన్ని ఎంచుకుంటే గొప్పగా ఎదిగే అవకాశాలుంటాయి. క్రీడా కోటాలో తాను ఉద్యోగం సాధించాను.

సాక్షి: మీ లక్ష్యం ఏమిటి?

శివారెడ్డి: 2036 ఒలింపిక్స్‌లో ఖోఖోను చేర్చాలని అనుకుంటున్నారు. ఇందుకు ఖోఖో సంఘం కృషిచేస్తోంది. ఒలింపిక్స్‌లో జాతీయ జట్టు నుంచి ఆడాలనేదే తన లక్ష్యం. భవిష్యత్తులో ఖోఖో మంచి స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నాను.

నిరంతర సాధనతోనే వరల్డ్‌ కప్‌లోకి

క్రీడారంగంలోనూ ఉజ్వల భవిష్యత్తు

‘సాక్షి’తో అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు శివారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
ఒలింపిక్స్‌ ఆడడమే లక్ష్యం1
1/2

ఒలింపిక్స్‌ ఆడడమే లక్ష్యం

ఒలింపిక్స్‌ ఆడడమే లక్ష్యం2
2/2

ఒలింపిక్స్‌ ఆడడమే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement