బావను కత్తితో పొడిచి హత్యచేసిన నిందితుడు అరెస్టు
తలమడుగు: బావను కత్తితో పొడిచి హత్యచేసిన ఘటనలో నిందితుడిని గురువారం అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ పణీందర్ తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో ఈమేరకు వివరాలు వెల్లడించారు. మండలంలోని రుయ్యాడి గ్రామంలో ఈనెల 18న కుటుంబ కలహాలతో కోకూరు మహేందర్‌ను బామ్మర్ది కుర్మా అశోక్ కత్తితో పొడి హత్య చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలించారు. ఆదిలాబాద్ సమీపంలో రూరల్ సీఐ, తలమడుగు ఎస్సై అంజమ్మలు నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు.
Comments
Please login to add a commentAdd a comment