● బకాయిల చెల్లింపునకు ఆదేశం ● వంట ఏజెన్సీలకు ఊరట
మంచిర్యాలఅర్బన్: పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిధులు మంజూరయ్యా యి. వంట ఏజెన్సీల నిర్వహణ, గౌరవ వేతనాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మంజూరు చేశాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి సంబంధించిన బిల్లుల బకాయిల చెల్లింపునకు ఆదేశాలు జారీ అయ్యాయి. 1 నుంచి 8వ తరగతి వంట ఏజెన్సీలు (కుకింగ్ కాస్ట్), గౌరవ వేతనం బిల్లులు విడుదల చేసినట్లు డీఈవో యాదయ్య తెలిపారు.
బిల్లుల మంజూరులో జాప్యం
మధ్యాహ్న భోజన బిల్లుల మంజూరులో ప్రతీసారి జాప్యంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఓ వైపు ఆకాశనంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, మరోవైపు ఉపాధ్యాయుల నుంచి వచ్చే ఒత్తిడి మేరకు అరువు తెచ్చి నెట్టుకొస్తున్నారు నిర్వాహకులు. నెలల తరబడి మధ్యాహ్న భోజన బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులే చదవుతున్నారు. వారికి ఉచిత భోజనం.. పుస్తకాలు, తగిన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు నిధులు ఖర్చు చేస్తున్నాయి. అంతేకాదు మధ్యాహ్న భోజన కోసం సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. నిధులు సకాలంలో రాక నిర్వాహకులు చేతులెత్తేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బిల్లుల విడుదలతో వంట ఏజెన్సీలకు ఊరట నిస్తోంది.
జిల్లాలో..
జిల్లాలో 742 పాఠశాలల్లో 1247 మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులు (కుక్ కమ్ హెల్పర్)గా పనిచేస్తున్నారు. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు భోజనం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకొని నిధులు విడుదల చేస్తాయి. 9, 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. నెలల తరబడి ఎదురు చూసే మధ్యాహ్న ఏజెన్సీలకు 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సంబంధించి జనవరి, ఫిబ్రవరి సంబంధించిన నిధులు మంజూరు కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వంట బిల్లులు, కుకు కమ్ హెల్పర్ గౌరవ వేతనం(రూ.1000) మంజూరయ్యాయి. డిసెంబర్, జనవరి పెండింగ్‌లో ఉన్న కోడిగుడ్డు బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు.
మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులు
ఉమ్మడి జిల్లాలో వంట బిల్లుల వివరాలు..
జిల్లా 1నుంచి సీసీహెచ్
8వ తరగతివరకు
ఆదిలాబాద్ రూ.1,09,10,738 రూ.36,00,000
ఆసిఫాబాద్ రూ.69,83,912 రూ.30,14,000
మంచిర్యాల రూ.60,60,712 రూ.25,34,000
నిర్మల్ రూ.81,62,282 రూ.28,28,000
Comments
Please login to add a commentAdd a comment