బెల్టుషాపులపై దాడి
ఆదిలాబాద్‌టౌన్: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అ మలులో ఉండడంతో టూటౌన్ పోలీసులు పట్టణంలోని ఇందిరానగర్‌లో గల బెల్టుషా పులపై గురువారం దాడులు నిర్వహించా రు. షేక్ అబ్దుల్ ఫరీద్ నుంచి 2.5 లీటర్ల మ ద్యం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2800 ఉంటుందని టూటౌన్ ఎస్సై వి ష్ణుప్రకాశ్ తెలిపారు. అదేవిధంగా అదే కాలనీలోని మరట్వార్ మధుకర్ నుంచి 2.6 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. వీటివిలువ రూ.2770 ఉంటుందన్నారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు
మహిళ మెడలో చైన్ చోరీకి విఫలయత్నం
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని తిలక్‌నగర్‌కు చెందిన విజయ ఈనెల 17న మధ్యాహ్నం తన మనువడు చదివే పాఠశాలకు భోజనం అందించేందుకు వెళ్లింది. తిరిగివస్తుండగా బైక్‌పై గుర్తుతెలియని యువకుడు ఆమె మెడలో పుస్తెల తాడును లాగాడు. ఆమె అరవడంతో వదిలి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాశ్ తెలిపారు.
ఆటోబోల్తా..నలుగురికి గాయాలు
కడెం: మండలంలోని కన్నాపూర్ గ్రామంలోని ఊరచెరువు కట్ట వద్ద గురువారం ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. దస్తురాబాద్ మండలం గొడిసేర్యాల్ నుంచి ఆటో కడెం వైపు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా, ఎల్లయ్యకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఖానాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
తప్పుడుపత్రాలతో సర్టిఫికెట్‌కు యత్నించిన వ్యక్తి అరెస్టు
కాసిపేట: తనపై ఎలాంటి కేసులు లేవని తప్పుడు పత్రాలతో సర్టిఫికెట్ కోసం య త్నించిన వ్యక్తిని గురువారం అరెస్టు చేసిన ట్లు కాసిపేట ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలి పారు. ఆయన కథనం ప్రకారం..మండలంలోని స్టేషన్ పెద్దనపల్లికి చెందిన కోవెల శ్రా వణ్ తనపై ఎలాంటి కేసులు లేవని పోలీసు వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. స్పెషల్ బ్రాంచి ఉన్నతాధికారులు దర్యాప్తు చేయగా శ్రావణ్‌పై చెక్‌బౌన్స్ కేసు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు సూచించారు. ఈ మేరకు అతన్ని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment