గంజాయి ముఠా గుట్టురట్టు
మంచిర్యాలక్రైం:జిల్లాకేంద్రంలో కొంతకాలంగా సీసీ కెమెరాల వ్యాపారం ముసుగులో గంజాయి దందా సాగిస్తున్న ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పో లీసులు రట్టు చేశారు. రూ.11.75లక్షల విలువైన 23.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వి వరాలను గురువారం రామగుండం పోలీసు కమిషనరేట్‌లో సీపీ శ్రీనివాస్ వెల్లడించారు. జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో కొంతకాలంగా స్థానిక ఎన్టీఆర్ నగర్‌కు చెందిన సోమ ప్రవీణ్‌కుమార్ తన సీసీ కెమెరాల దుకాణంలో రాజీవ్‌నగర్‌కు చెందిన ఇరుగురాళ్ల సతీష్‌కుమార్‌తో కలిసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని గంజాయి దందా చేస్తున్నాడు. ఇద్దరికీ గంజాయి తాగే అలవాటు ఉండడంతో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం జిల్లా సీలేరు నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఇక్కడ కొంతమంది యువకులను ముఠాగా ఏర్పాటు చేసుకుని అధిక ధరకు విక్రయించేవారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు గోదాంపై దాడి చేసి గంజాయి ప్యాకెట్లు తీసుకెళ్లడానికి వచ్చిన 11మంది ఇరుగురాళ్ల సతీష్, సప్తగిరి కాలనీకి చెందిన ఎండీ సమీర్, భగవంతంవాడకు చెందిన బీమ అనుదీప్, తిలక్‌నగర్‌కు చెందిన ఎండీ.అబ్దుల్ ఊబేద్, ముంబయికి చెందిన(ప్రస్తుతం కరీంనగర్) అర్జున్‌బాబురావు చౌహన్, రాజీవ్‌నగర్‌కు చెందిన జాడి రాఘవేంద్రస్వామి, సీసీసీ నస్పూర్‌కు చెందిన గూడూరు రాము, మంచిర్యాలకు చెందిన ఎస్‌కే.ఇస్మాయిల్, ఎస్‌కే.సమీర్, మరొక మైనర్‌ను అరెస్టు చేశారు. వీరి నుంచి 23.5కిలోల గంజాయి, 11సెల్‌ఫోన్లు, 5మోటార్‌సైకిళ్లు, వేయింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. ముఠా నాయకుడు సోమ ప్రవీణ్‌కుమార్, తగరపు రాజు, తగరపు శృతి(భార్యాభర్తలు), తగరపు వినయ్, రామాలయం రాకేష్, శ్రీధర్, మున్నీ, చింటు, ఆల్మేకర్ శ్యామ్, క్వార్టర్ సాయి, సొహెల్ పరారీలో ఉన్నారు. ముఠా గుట్టును రట్టు చేసిన ఏసీపీ ప్రకాశ్, సీఐ ప్రమోద్‌రావు, ఎస్సైలు, టాస్క్‌ఫోర్స్ బృందాన్ని సీపీ అభినందించారు.
సీసీ కెమెరాల వ్యాపారం ముసుగులో దందా
23.5 కిలోల గంజాయి స్వాధీనం
11 మంది అరెస్ట్, పరారీలో
మరో 11 మంది
వివరాలు వెల్లడించిన
రామగుండం సీపీ శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment