కారును ఢీకొట్టిన లారీ
● ప్రమాదంలో మహిళ మృతి ● మంటలు చెలరేగి దగ్ధమైన కారు ● ఆగిన పెళ్లి.. ఇరు కుటుంబాల్లో విషాదం
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/భీమిని: మేనల్లుడి పెళ్లి కోసం కారులో పెళ్లికూతురును తీసుకువస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందింది. మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. హాజీపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజాము ఈ ఘటన చోటుచేసుకుంది. హాజీపూర్ ఎస్సై గోపతి సురేశ్ కథనం ప్రకారం.. భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన మహిళ కర్రె రాజు మేనల్లుడి పెళ్లి గురువారం జరగాల్సి ఉంది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని అబ్బాపూర్ గ్రామానికి చెందిన పెళ్లి కూతురును తీసుకురావడానికి ఆమె కారులో వెళ్లింది. పెళ్లి కూతురుతో కలిసి కారులో వస్తుండగా హాజీపూర్ శివారులోని జాతీయ రహదారిపై మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట వైపు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కర్రె రాజు(49) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. కారులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు డీజిల్ ట్యాంకు లీకేజీ కారణంగా మంటలు చెలరేగి దగ్ధమైంది. మృతురాలికి భర్త మల్లయ్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. కాగా, రాజు మృతితో పెళ్లి ఆగిపోయింది. ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
కారును ఢీకొట్టిన లారీ
Comments
Please login to add a commentAdd a comment