షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం
● ఐదు ఇళ్లు, రెండు కొట్టాలు దగ్ధం
పెంబి: మండలంలోని రాయదారి గ్రామంలో గురువారం షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మొత్తం ఐదు ఇళ్లు, రెండు కొట్టాలు దగ్ధమయ్యాయి. మధ్యాహ్న సమయంలో రాథోడ్ బిక్కు ఉంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగంతో పక్కనే ఉన్న జాదవ్ కిమ్యా, రాథోడ్ నరేశ్, జాదవ్ రవీందర్, రాథోడ్ రవీందర్‌ల ఇళ్లు, బనావత్ దేశాయి, జాదవ్ దినేశ్‌లకు చెందిన కొట్టాలు అగ్నికి అహుతయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్లతో చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. రాథోడ్ బిక్కు ఇంట్లో రూ.6 లక్షలు, కిమ్యా జాదవ్ ఇంట్లో రెండు తులాల బంగారం కాలిబూడిదయ్యాయి. తహసీల్దార్ లక్ష్మణ్, సీఐ సైదారావు, ఎంపీడీవో రమాకాంత్, ఎస్సై హన్మండ్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తమను ఆదుకోవాలని బాధితులు అఽధికారులను వేడుకున్నారు.
బాధితులను ఆదుకుంటాం: కలెక్టర్
పెంబి/నిర్మల్‌చైన్‌గేట్: అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బాధితులకు రాత్రి భోజనం, బస ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటన సంబంధించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఆర్థికసాయం, ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు.
Comments
Please login to add a commentAdd a comment