అప్పుల బాధతో వలసకార్మికుడు ఆత్మహత్య
లక్సెట్టిపేట: అప్పుల బాధతో వలస కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని హన్మంతుపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సతీశ్ కథనం ప్రకారం.. హన్మంతుపల్లికి చెందిన నస్పూరి గౌరయ్య(50)కు భార్య సత్తవ్వ, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఉపాధి నిమిత్తం 20 ఏళ్ల క్రితం ముంబయి వెళ్లి కూలీ పనిచేస్తున్నాడు. అప్పుడుప్పుడు స్వగ్రామానికి వచ్చి వెళ్తుండేవాడు. సుమారు రూ.5 లక్షల అప్పుచేసి రెండేళ్ల క్రితం కూతురు పెళ్లితోపాటు ఇల్లు కట్టుకున్నాడు. అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపం చెందాడు. గురువారం తెల్లవారుజాము తన ఇంటిగదిలోని స్లాబ్‌కు తాడుతో ఉరేసుకున్నాడు. కుటుంబీకులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై అక్కడికి చేరుకుని పరిశీలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment