నెన్నెల: రైతుల నుంచి అక్రమ వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొని సస్పెండైన నె న్నెల విద్యుత్ ఏఈఈ మిట్టపల్లి మల్లయ్య కేసులో ఆర్థికపరమైన లావాదేవీలపై ఏసీబీ అధికా రులు గురువారం విచారణ జరిపారు. ఏసీబీ ఎస్సై కిరణ్‌రెడ్డి గొల్లపల్లి గ్రామంలో బాధిత రై తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. 2024 జూన్‌లో గొల్లపల్లి గ్రామానికి చెందిన ప లువురు రైతుల నుంచి పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు కోసం ఏఈఈ డబ్బులు వసూలు చే శారని, డీడీలు కట్టినా విద్యుత్ కనెక్షన్‌లు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయాయని ఎన్‌పీడీసీఎల్ సీఎండీకి ఫిర్యాదు చేశారు. సీఎండీ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు అప్పట్లో ప్రాథమిక విచారణ చేపట్టి ఏఈఈ మల్లయ్య ను సస్పెండ్ చేశారు. ఈ కేసును ఏసీబీకి అప్పగించగా విచారణ చేపట్టారు. ఎవరెవరు ఎంత డబ్బులు ఇచ్చారో తెలుసుకున్నారు. వివరాలన్నీ ఉన్నతాధికారులకు సమర్పిస్తామని ఎస్సై కిరణ్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment