పత్తి కొనుగోళ్లు ప్రారంభం
చెన్నూర్: చెన్నూర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లు గురువారం ప్రారంభమయ్యాయి. సీసీఐ ఆధ్వర్యంలో పది రోజులకు పైగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ‘రోడ్లపైనే తెల్ల బంగారం’ శీర్షికన ఈ నెల 18న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి స్పందించారు. ఢిల్లీ లో బుధవారం కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, గిరి రాజ్‌లను కలిసి పత్తి కొనుగోళ్లు చేపట్టాలని కో రారు. మంత్రుల ఆదేశాలతో చెన్నూర్ ప్రాంతంలో పత్తి కొనుగోళ్లు చేపట్టారు. పత్తి కొనుగో ళ్లకు కృషి చేసిన ఎమ్మెల్యే, ఎంపీ చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పత్తి మిల్లుల వద్ద పాలా భిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చల్లా రాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు హిమవంతరెడ్డి, కుర్మ రాజమల్లగౌడ్, చింతల శ్రీనివాస్, గజ్జెల అంకగౌడ్, బుర్ర కృష్ణగౌడ్, అన్వర్, దాసరి కమలాకర్ పాల్గొన్నారు.
పత్తి కొనుగోళ్లు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment