లోకో పైలెట్ల నిరసన దీక్ష
బెల్లంపల్లి: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం బెల్లంపల్లిలో రైల్వే లోకో పైలెట్లు నిరసన దీక్ష చేపట్టారు. రైల్వేస్టేషన్ ఆవరణలో 36 గంటల నిరసన దీక్షను ఆల్ ఇండియా రైల్వే లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ జోనల్ వ ర్కింగ్ కమిటీ సభ్యుడు చింతల్‌కుమార్ ప్రా రంభించారు. ఆయన మాట్లాడుతూ రైల్వేలోని అన్ని విభాగాల్లో అమలు చేస్తున్న రన్నింగ్ అలవెన్స్ 25శాతాన్ని రన్నింగ్ స్టాఫ్‌కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బదిలీల ప్రక్రియ వేగవంతంగా నిర్వహించాలని, వారంతపు సెలవు రన్నింగ్ స్టాఫ్‌కు 46గంటలకు పెంచాలని, రెండు నైట్ డ్యూటీలు మాత్రమే ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి బ్రాంచ్ ప్రెసిండెంట్ ఏకే పటేల్, సెక్రెటరీ అజయ్‌కుమార్, నాయకులు ఏకే మౌర్య, రవీందర్ రాయ్, ఫియాన్స్ ధనవ్, రన్నింగ్ స్టాఫ్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment