మెరుగైన వైద్య సేవలందించాలి
చెన్నూర్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వాలు ఆస్పత్రులకు అన్ని వసతులు కల్పిస్తున్నాయని పాపులేషన్ ఆఫ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కేంద్ర బృందం సభ్యులు వైజాగ్‌కు చెందిన డాక్డర్ రమణ, శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం చెన్నూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంతోపాటు మండలంలోని అంగ్రాజుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అస్నాద్‌లోని ఆరోగ్య ఉప కేంద్రాలను సందర్శించారు. రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి వారితో మాట్లాడారు. వైద్యుడు రమణ మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగయ్యాయని తెలిపారు. ఆస్పత్రుల నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల సీహెచ్‌వో వెంకటేశ్వర్, డీపీఎంవో ప్రశాంతి, ఎంసీహెచ్ పీవో కృపాభాయి, హెచ్‌సీవో జగదీశ్, వైద్యులు సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment