చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని లక్సెట్టిపేట కోర్టు సీనియర్ సివిల్ జడ్జి అర్పిత మారంరెడ్డి అన్నారు. శుక్రవారం దొనబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పదవ తరగతి పరీక్షలకు ఏ విధంగా సమాయత్తం కావాలో వివరిస్తూ విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదవాలని పేర్కొన్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది తులా ఆంజనేయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.హన్మాండ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment