తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు
బెల్లంపల్లి: మున్సిపాలిటీలో వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. రిజిష్టర్లు, ప్రజాపాలన సేవ కేంద్రాలను పరిశీలించి మున్సి పల్ కమిషనర్ కే.శ్రీనివాసరావు, అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ఇంటికి నిరంతరాయంగా నీటి సరఫరా చేయాలని, పంపు మోటార్లు, నీటి ట్యాంకులు మరమ్మతులు చేయించాలని, పైపులైన్ల లీకేజీలను అరికట్టాలని వివరించారు.
చదువు గౌరవాన్ని పెంచుతుంది..
కాసిపేట: సమాజంలో చదువు గౌరవాన్ని పెంచుతుందని, ప్రతి ఒక్కరూ చదువు నేర్చుకోవాలని జి ల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ముత్యంపల్లి రైతువేదికలో వంద రోజుల్లో వందశాతం అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా అక్షరాస్యత కేంద్రాలు, కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం మన వైపు చూసేలా వందరోజుల్లో వందశాతం అక్షరాస్యత విజయవంతం చేయాలన్నారు. గ్రామ పంచాయతీకి రెండు చొప్పున కుట్టుమిషన్లు, వయోజనులకు పలకలు పంపిణీ చేసి అక్షరాలు రాయించారు. ఈ కార్యక్రమంలో ఓరియంట్ హెచ్‌ఆర్ జీఏం ఆనంద్ కులకర్ణి, డీఆర్‌డీవో కిషన్, డీపీవో వేంకటేశ్వరరావు, మెప్మా పీడీ రవూఫ్‌ఖాన్, తహసీల్దార్ భోజన్న, ఎంపీడీవో సత్యనారాయణసింగ్, వయోజనవిద్య కోఆర్డినేటర్ బండ శాంకరీ, ఓరియంట్ అధికారులు బాల గిరిధర్, తిరుపతి పాల్గొన్నారు.
పాఠశాలల తనిఖీ
మండలంలోని తాటిగూడ దిశ మోడల్ స్కూల్, కో నూర్ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ తనిఖీ చేశా రు. అమ్మ ఆదర్శ పాఠశాలల నిధులతో చేపట్టిన పనులు పూర్తికాక పోవడానికి కారణాలు తెలుసుకున్నారు. దిశ మోడల్ స్కూల్‌లో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
● కలెక్టర్ కుమార్ దీపక్
Comments
Please login to add a commentAdd a comment