కాగితపు రహిత సేవలకు శ్రీకారం
శ్రీరాంపూర్: ఉద్యోగుల సమస్త సమాచారం కాగిత రహితంగా ఉండేలా సేవలకు శ్రీకారం చుట్టామని శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం సీసీసీలోని సింగరేణి గెస్ట్‌హౌస్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏరియాలోని అధికారులకు సాప్, ఎఫ్‌ఎల్‌ఎం(ఫైల్ లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్) అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు సాప్ సేవలు వినియోగించుకున్నామని, మరింత సులభతరం, కచ్చితత్వం కోసం ఎఫ్‌ఎల్‌ఎంను సద్విని యోగం చేసుకోవాలని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పరిజ్ఞానం పూర్తిగా అందుబాటులోకి రానుంద ని తెలిపారు. సంస్థ, ఉద్యోగుల సమస్త సమాచారం కంప్యూటర్‌లో నిక్షిప్తం చేస్తామని పేర్కొన్నారు. డీజీఎం(ఐటీ) హరిప్రసాద్, మేనేజర్ ఎం.కిరణ్‌కుమార్, సీనియర్ ప్రోగ్రామర్ శంకర్ సాంకేతికతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జీఎం సివిల్ శ్రీనివాసరావు, బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జీఎం సుశాంత్, ఏరియా ఎస్‌ఓటు జీఎం ఎన్.సత్యనారాయణ, శ్రీరాంపూర్ ఓసీపీ అధికారి టీ.శ్రీని వాస్, ఏజీఎం ఫైనాన్స్ మురళీధర్, ఏజీఎం సివిల్ బీ.నవీన్, డీజీఎంలు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment