మిగిలిన రోజులు ఉత్పత్తికి కీలకం
శ్రీరాంపూర్: వార్షిక సంవత్సరంలో మిగిలిన రోజులు బొగ్గు ఉత్పత్తికి ఎంతో కీలకమని సింగరేణి డైరెక్టర్(పీపీ) కొప్పుల వెంకటేశ్వర్లు తెలి పారు. శుక్రవారం ఆయన శ్రీరాంపూర్ ఏరి యాలో పర్యటించారు. జీఎం కార్యాలయంలో జీఎం ఎం.శ్రీనివాస్ ఇతర అధికారులతో బొ గ్గు ఉత్పత్తి లక్ష్యాలపై సమీక్షించారు. అనంత రం శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించారు. క్వారీలోకి దిగి కోల్ బెంచీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 31నాటికి నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలని, ఇందుకోసం ప్రణాళికలు త యారు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం యన్.సత్యనారాయణ, ఓసీపీ అధికారి టీ.శ్రీనివాస్, ఇందారం ఓ సీపీ అధికారి ఏ.వెంకటేశ్వరరెడ్డి, ఇన్‌చార్జీ ఏరి యా ఇంజనీర్ సాంబశివరావు, గని మేనేజర్ బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment