‘ప్రభుత్వరంగ సంస్థలు నిర్వీర్యం’
నస్పూర్: సింగరేణి, విద్య, వైద్యం, ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని సింగరేణి గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు అరుణోదయ విమలక్క విమర్శించా రు. నస్పూర్–శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవా రం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 23న గోదావరిఖనిలోని రాజ్యలక్ష్మి గార్డెన్‌లో ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర సాధారణ సమావేశం ని ర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీరాంపూర్ ఏరి యా నుంచి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ కా ర్మికుల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. సింగరేణిలో ప్రైవేటికరణను ప్రోత్సహిస్తూ యాంత్రీకరణను పెంపొందించి కార్మికుల సంఖ్యను కుదించారని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ స మావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు జి.రాములు, ప్ర ధాన కార్యదర్శి మాతంగా రాయమల్లు, కోశాధికారి మేకల పోషమల్లు, నాయకులు రాజేశ్వరి, రత్నకుమారి, రేగుంట రాజు, సదానందం, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment