● ఆధార్ డిప్యూటీ డైరెక్టర్ చైతన్యరెడ్డి
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉండాలని యుఐడీఏఐ(ఆధార్) డిప్యూటీ డైరెక్టర్ చైతన్యరెడ్డి అన్నారు. శుక్రవారం వర్చువల్ విధానం ద్వారా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, జిల్లా స్థాయి ఆధార్ మాని టరింగ్ కమిటీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ డైరెక్టర్ చైతన్యరెడ్డి మాట్లాడు తూ 2025 జనవరి నాటికి 15,953 మంది ఐదేళ్లలోపు పిల్లలు, 99,769 మంది 5నుంచి 18ఏళ్లలోపు బాలబాలికలు, 5,08,373 మంది 18 ఏళ్లు పైబడిన వారికి ఆధార్ కార్డు జారీ చేసిన ట్లు తెలిపారు. పిల్లలు జన్మించిన వెంటనే ఆసుపత్రి ద్వారా జనన ధ్రువీకరణ పత్రం తీసుకో వాలని, పిల్లలకు టీకాలు వేసే సందర్భంలో ఆ ధార్ కిట్ ద్వారా ఎన్‌రోల్‌మెంట్‌ను ప్రోత్సహించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనన ధ్రువీకరణ పత్రాల జారీలో శ్రద్ధ వహించాలని, ఆధార్ కార్డులో మార్పులో జనన ధ్రువీకరణ పత్రానికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment