● రాష్ట్ర ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్‌రెడ్డి
మంచిర్యాలఅగ్రికల్చర్: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఇతర అదనపు ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఈ నెల 25లోగా ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు 40 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ 18 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. డీసీపీ ఏ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణ, ఎన్నికల పర్యవేక్షకులు ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment