మాలలను అణచివేస్తున్న సీఎం
● మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్
నిర్మల్‌టౌన్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ చేతిలో సీఎం రేవంత్ రెడ్డి పావుగా మారి మాలలను అణచివేస్తున్నాడని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని టీఎన్జీవోస్ భవనంలో శుక్రవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తిగా మాదిగల పక్షంగా జరుగుతుందన్నారు. ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించకుండా ఆశాసీ్త్రయమైన 2011 జనాభా లెక్కలతో వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదం చేశారని మండిపడ్డారు. వాస్తవానికి ఎస్సీల జనాభా 20% ఉందని, దానికి అనుగుణంగా రిజర్వేషన్లు 20% పెంచి వర్గీకరణ ప్రయత్నాలు చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న వైఖరిని ఎండగట్టి, పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశలంలో జైభీమ్ సైనిక్ దళ్ రాష్ట్ర కన్వీనర్ కనకరాజు, రాజన్న, గజెల్లి లక్ష్మణ్, బొడ్డు లక్ష్మణ్, వెంకటస్వామి, పురుషోత్తం, మురళీధర్, రవి, ప్రేమ్‌సాగర్, సదానందం, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment