పెంబి: విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతిచెందిన ఘటన మండలంలోని నాగాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై హన్మాండ్లు కథనం ప్రకారం.. నాగాపూర్‌కు చెందిన రాపెని మైసయ్య (47) గ్రామశివారులో మొక్కజొన్నను కౌలుకు తీసుకున్నాడు. శుక్రవారం ఉదయం పెద్ద కుమారుడు మహేశ్‌తో కలిసి మొక్కజొన్న చేను వద్దకు వెళ్లారు. అక్కడ విద్యుత్ బల్బు కోసం అమర్చిన జీ వైరుకు మైసయ్య చేతిలో ఉన్న కొడవలి తగిలి షాక్‌కు గురయ్యాడు. గమనించిన కుమారుడు తప్పించే ప్రయత్నం చేయగా తీవ్ర గాయాలయ్యాయి. మైసయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. గాయాలైన మహేశ్‌ను స్థానికులు ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య భీమక్క ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment