నిర్మల్‌టౌన్: డబ్బుల కోసం వేధించిన వ్యక్తికి ఏడాది జైలుశిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ నిర్మల్ న్యాయస్థానం శుక్రవారం తీర్పునిచ్చింది. కోర్టు సమన్వయల అధికారి డల్లుసింగ్ కథనం ప్రకారం..జిల్లాకేంద్రంలోని శాస్త్రినగర్ కాలనీకి చెందిన నర్సయ్య టైలర్‌గా పనిచేస్తున్నాడు. అవసరం నిమిత్తం లక్ష్మణచాంద మండలం కనకాపూర్‌కు చెందిన సతీశ్ వద్ద రూ.50 వేలు అప్పు తీసుకున్నాడు. తిరిగి రూ.39 వేలు చెల్లించాడు. మిగతా డబ్బుల కోసం సతీశ్ తరచూ టైలర్ షాపు వద్దకు వెళ్లి వేధించేవాడు. 2015 జూన్ 22న నర్సయ్య భార్య షాపులో ఉన్న సమయంలో అక్కడికి వచ్చి గొడవపడ్డాడు. ఆమెను గాయపర్చాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. పీపీ వినోద్‌రావు సాక్షులను విచారించి నేరం రుజువు చేయడంతో న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment