● ఆస్తిపన్ను వడ్డీలో 90శాతం రాయితీ ● ఓటీఎస్‌ను ప్రకటించిన ప్రభుత్వం ● పాత బకాయిలు వసూలయ్యేనా? ● ముంచుకొస్తున్న చెల్లింపు గడువు | - | Sakshi
Sakshi News home page

● ఆస్తిపన్ను వడ్డీలో 90శాతం రాయితీ ● ఓటీఎస్‌ను ప్రకటించిన ప్రభుత్వం ● పాత బకాయిలు వసూలయ్యేనా? ● ముంచుకొస్తున్న చెల్లింపు గడువు

Mar 27 2025 12:25 AM | Updated on Mar 27 2025 12:23 AM

లక్ష్య సాధనలో సింగరేణి కీలకం

నస్పూర్‌: నగర పాలక ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్య సాధనలో సింగరేణి సంస్థ చెల్లింపే కీలకం కా నుంది. నస్పూర్‌ పరిధిలోని గనులు, క్వార్టర్లు, కార్యాలయాలు, ఫంక్షన్‌హాళ్లు, ఓసీపీలు, పాఠశాలలు, కళాశాలలు, సీవేజ్‌ ప్లాంటు, తదితర సింగరేణి ఆస్తులు మొత్తం 1,591 అసెస్‌మెంట్లు ఉ న్నాయి. వీటికి మున్సిపల్‌ అధికారులు రూ. 1.30 లక్షల ఆస్తిపన్ను విధిస్తుండగా సింగరేణి సంస్థ రూ.50 లక్షలు చెల్లిస్తోంది. కాగా నస్పూర్‌, తాళ్లపల్లి, సింగాపూర్‌, తీగల్‌పహడ్‌ను కలుపుకుని 2018 ఆగస్టులో నస్పూర్‌ మున్సిపాలిటీగా ఏర్పడింది. అనంతరం నూతనంగా ఏర్పడిన భవనాలకు మున్సిపాలిటీ లెక్కల ప్రకారం ఆస్తిపన్ను అమలు చేసేందుకు 2022లో భువన్‌ సర్వే చేశారు. సింగరేణి ఆస్తులకు సంబంధించి ఏడాదికి రూ.1.30 లక్షలుగా నిర్ధారించారు. సింగరేణి అధికారులు గతంలో మాదిరిగానే రూ.50 లక్షలు చెల్లిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ నగర పాలకంగా మారిన నేపధ్యంలో సింగరేణి సంస్థ రీ సర్వేకు అనుకూలంగా ఆస్తిపన్ను చెల్లిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. సింగరేణి సంస్థ తమకు నిర్ధేశించిన ఆస్తిపన్ను చెల్లిస్తేనే నగర పాలక సంస్థ లక్ష్యాన్ని చేరుతుంది. ఇదే విషయమై కమిషనర్‌ శివాజీని సంప్రదించగా సింగరేణి సంస్థ నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఆస్తిపన్ను వివరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారన్నారు.

మంచిర్యాలటౌన్‌: జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్‌తో పాటు, జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పన్ను వసూళ్ల కోసం అధికారులు, సిబ్బంది పడుతున్న తిప్పలు అంతా ఇంతా కావు. ఏటా ఫిబ్రవరి నుంచి మార్చి 31వ తేదీ వరకు అధికారులు, ఉద్యోగులు పన్ను వసూళ్ల కోసం బృందాలుగా ఏర్పడి తిరుగుతున్నా అంతంత మాత్రంగానే వసూలవుతున్నాయి. ఆస్తిపన్ను సక్రమంగా వసూలైతే కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయి. పన్ను బకాయిదారులకు రెడ్‌ నోటీసులను జారీ చేసి, ఆస్తులు జప్తు చేస్తామని చెప్పినా స్పందన రావడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను బకాయిలు చెల్లించిన వారికి 90 శాతం వడ్డీ మాఫీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ ఈ నెల 25న ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రమే ఉండేదని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇవే ఉత్తర్వులు మార్చి మొదటి వారంలోనే విడుదల చేసి ఉంటే పన్ను వసూళ్లు మరింత పెరిగేవి. కానీ ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉండడం.. అందులో ఉగాది, రంజాన్‌ పండుగలు రావడం పన్ను చెల్లింపులకు ఆటంకంగా మారనుంది.

రెడ్‌ నోటీసులు ఇస్తున్నా ...

ఆస్తి పన్ను చెల్లించాలని మున్సిపల్‌ అధికారులు పలు విధాలుగా కోరుతున్నా ఏళ్ల తరబడి పన్ను చెల్లించకుండానే కొందరు కాలం వెల్లదీస్తున్నారు. దీంతో కార్పొరేషన్‌, మున్సిపాలిటీలకు రావాల్సిన ఆదాయం సమకూరక పోవడంతో అభివృద్ధితో పాటు సిబ్బంది, కార్మికులకు వేతనాలు సైతం ఇవ్వలేని పరిస్థితి నెలకొంటోంది. జిల్లాలో గతంలో మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి మున్సిపాలిటీలు ఉండగా ఐదేళ్ల్ల క్రితం నస్పూరు, క్యాతన్‌పల్లి, లక్సెట్టిపేట్‌, చెన్నూరు కొత్తగా ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోనే సిబ్బంది వేతనాలు చెల్లిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో మంచిర్యాల, నస్పూరు మున్సిపాలిటీలతో పాటు, హాజీపూర్‌ మండలంలోని 8 గ్రామాలను కలిపి మంచిర్యాల కార్పొరేషన్‌గా మార్చారు. దీంతో పన్ను డిమాండ్‌ పెరగడంతో పన్ను వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కనీసం 50 శాతం కూడా వసూలు కాకపోవడంతో మిగిలిన ఐదు రోజుల్లో అనుకున్న లక్ష్యం చేరడం కష్టమే. అధికారులు ఇప్పటికే బకాయిదారులకు రెడ్‌ నోటీసులు ఇచ్చి పది రోజుల్లో చెల్లించాలని చెబుతున్నా స్పందన అంతంతే.

చట్ట ప్రకారమే పన్ను వసూళ్లు

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల కార్పొరేషన్‌ పరిధిలో పన్ను వసూలుకు టీంలను ఏర్పా టు చేసి పంపిస్తున్నామని, బకాయిదారులకు రెడ్‌ నోటీసులు ఇచ్చి గడువులోపు చెల్లించకుంటే చట్ట ప్రకారమే వసూలు చేస్తున్నామని కమిషనర్‌ శివాజీ అన్నారు. బుధవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వందఫీట్ల రోడ్డులో ఓ ఇంటి యజమాని కొన్నేళ్లుగా పన్ను చెల్లించడం లేదని, సిబ్బంది వెళ్లి అడిగితే దురుసుగా ప్రవర్తించారని చేస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. ప్రభుత్వం బకాయి వడ్డీపై 90 శాతం మాఫీ ప్రకటించిందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మార్చి 31లోగా పన్నులు చెల్లించాలని కోరారు.

● ఆస్తిపన్ను వడ్డీలో 90శాతం రాయితీ ● ఓటీఎస్‌ను ప్రకటించ1
1/3

● ఆస్తిపన్ను వడ్డీలో 90శాతం రాయితీ ● ఓటీఎస్‌ను ప్రకటించ

● ఆస్తిపన్ను వడ్డీలో 90శాతం రాయితీ ● ఓటీఎస్‌ను ప్రకటించ2
2/3

● ఆస్తిపన్ను వడ్డీలో 90శాతం రాయితీ ● ఓటీఎస్‌ను ప్రకటించ

● ఆస్తిపన్ను వడ్డీలో 90శాతం రాయితీ ● ఓటీఎస్‌ను ప్రకటించ3
3/3

● ఆస్తిపన్ను వడ్డీలో 90శాతం రాయితీ ● ఓటీఎస్‌ను ప్రకటించ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement