● ఖురాన్ అవతరణ దినం ● మహాత్తరమైన రాత్రిగా గుర్తింపు
నెన్నెల: రంజాన్ మాసంలో ఇస్లాం చర్రితలోనే ముఖ్యమైన రాత్రి. ఈ మాసం ప్రారంభమై గురువారానికి 26వ రోజున అల్లా అంతిమ దైవగ్రంథం దివ్య ఖురాన్ అవతరించింది. దీన్ని షబ్–ఏ–ఖదర్‌గా పిలుస్తారు. ఈ గ్రంథం మార్గనిర్ధేశం చేస్తుందని నెన్నెల జామా మసీదు మౌలానా షగీర్ అహ్మద్ బర్కద్‌వా చెప్పారు. ఖురాన్ సన్మార్గ బాటలో పయనించడానికి ఉపకరిస్తుందని వివరించారు. ఖురాన్ పఠనం చేసిన వారి సంఖ్య భారీగా ఉండటం దైవ సంకల్పానికి నిదర్శమన్నారు. పదేళ్ల వయస్సు చిన్నారులు దీన్ని పఠించడం విశేషమన్నారు. చరిత్ర పుఠల్లో ఏ పుస్తకాలను తిరగేసినా కాలానుగుణంగా మార్పు చెందుతాయని, అదే ఖురాన్ అవతరించి సుమారు 1450 ఏళ్లు దాటుతున్నా అక్షరం కూడా మార్పు చెందలేదన్నారు. ఖురాన్‌లో 30 ఫారాలు(పాఠాలు), 114 సూరాలు, 6666 వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు.
అశాంతి రాజ్యమేలిన నేపథ్యం..
అరబ్బుల హయాంలో అశాంతి రాజ్యమేలిన నేపథ్యమే దివ్య ఖురాన్ అవతరణకు మూలమని మౌలానాన షగీర్ అహ్మద్ బర్కద్‌వా తెలిపారు. అప్పట్లో ఎక్కడ కూడా ప్రశాంత వాతావరణం కనిపించేది కాదని, ఒకరి హక్కులు మరొకరు కాలరాస్తూ పరస్పరం దూషించుకుంటూ దాడులకు పాల్పడుతూ గడిపేవారని వివరించారు. ఈ నేరమయ సంస్కతిని చూసి మహ్మద్ ప్రవక్త చలించిపోయి మానసిక ఉపశమనం కోసం ‘ఘారెహిర’ అనే గుహలో ఒంటరిగా కూర్చొని అల్లాను స్మరించుకునేవారని, ఒకరోజు అల్లాహ్ తన దూత జిబ్రాయిల్ ద్వారా మహ్మద్ ప్రవక్తకు చేరవేసిన సందేశం చదివాక ప్రవక్త మనస్సు ఆలోచనతో ప్రపంచ గమనాన్ని చుట్టి వచ్చిందన్నారు. ఆ సందేశాలకు విస్తత ప్రచారం కలిగిస్తే ప్రజలకు చెడు నుంచి విముక్తి కలిగించి సన్మార్గంలో నడపొచ్చని ఆయన ప్రగాఢంగా విశ్వసించారని చెప్పారు. వాటి నుంచి అల్లాహ్ తన సందేశం వినిపించేవారని, అలా నలబై ఏటా నుంచి దశల వారీగా 30 ఏళ్ల పాటు అల్లాహ్ అందించిన భిన్న సందేశాల సమాహారమే ఖురాన్ మహాగ్రంథం. రంజాన్ మాసంలోని 26 నాడు అవతరించిందని వివరించారు. ఖురాన్ చదవడానికి ముందు విధిగా వజూ చేసి ఆపై ఖురాన్‌ను చేత పట్టుకుని ఖిబ్లా(పడమర) వైపు తిరిగి దైవనామస్మరణతో చదవాలని వివరించారు.
వెయ్యి నెలల పుణ్యఫలం
పవిత్ర గ్రంథం ఖురాన్‌ను ఈ రాత్రే అల్లాహ్ ప్రసాదించారని దీన్ని పవిత్రమైన రాత్రిగా పాటిస్తాం. వెయ్యినెలల రాత్రులకంటే ఎంతో ఘనమైంది. ఈ రాత్రి జాగరణ చేస్తూ నమాజ్‌ను ఆచరిస్తుంటాం. దివ్య ఖురాన్‌ను పఠిస్తాం. రాత్రి జాగరణతో ఫుణ్యఫలాలు లభిస్తాయనే విశ్వాసం ముస్లిం సోదరుల్లోలో ఉంది. –షగీర్ అహ్మద్
బర్కద్‌వా, మత గురువు, నెన్నెల
నేడు షబ్–ఏ– ఖదర్


