సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కొందరు రియల్ వ్యాపారులు ప్రభుత్వ, సాగునీటి వనరుల భూములు అని తేడా లేకుండా ఇష్టారీతిన అమ్మేయడంతో కొనుగోలుదారులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని అనేక చోట్ల చెరువు, శిఖం, కాలువలు, కోర్, బఫర్ తేడా లేకుండా ప్లాట్లుగా చేసి అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. నిబంధనల ప్రకారం అలాంటి భూ ములు కొనుగోలు, అమ్మకాలు చేయరాదు. అయితే జిల్లాలో కడెం, గూడెం ఎత్తిపోతలు, ర్యాలీవాగు ప్రాజెక్టు కాలువలతోపాటు చిన్న వాగులు, వంకలు, వందలాది చెరువులు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో చెరువుల సమీపం, కట్టలు, మత్తడి వరకు ప్లాట్లు చేసి అమ్మేశారు. ఇక ఎఫ్‌టీఎల్(ఫుల్ ట్యాంకు లెవల్) పరిధిలోనూ పట్టా భూములు ఉన్నాయని వెంచర్లు చేసి అమ్మేశారు. గతంలోనే కొన్ని చోట్ల సాగునీటి శాఖ అధికారులు అభ్యంతరాలు చెబుతూ నోటీసులు ఇచ్చారు. దీనిపై కొందరు కోర్టులకు వెళ్లి మరీ స్టేలు, ఆర్డర్లు తెచ్చుకున్నారు. పంట పొలాలనే వెంచర్లుగా మార్చడంతో చాలా చోట్ల సహజ వనరులు కబ్జాలయ్యాయి. పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ ఆక్రమణలు జరిగాయి. ఏడు మున్సిపాలిటీల్లో 39,512 ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు రాగా, ఇందులో 9500వరకు నిషేధిత భూముల్లో ఉన్నట్లు ప్రాథమిక దశలో నిలిపివేశారు. ఇక పంచాయతీల్లో 15,729 దరఖాస్తులు రాగా, వీటిలో 2500 నిషేధిత భూముల్లో ఉన్నట్లు అధికారులు పరిశీలనలో గుర్తించారు.
‘ఎన్‌వోసీ’లకు కష్టాలు..
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించాలంటే ప్రభుత్వ, సాగునీటి పరిధిలో భూములు లేకుండా ఉంటేనే ఆమోదం లభిస్తున్నాయి. ఎక్కడైనా పరిశీలనలో తేలితే షాట్‌పాల్ కింద నమోదు చేసి హోల్డ్‌లో ఉంచుతున్నారు. దీంతో ఆ ప్లాట్ల యజమానులు ఫీజు చెల్లించకుండా నిలిపివేస్తున్నారు. దీంతో అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్‌వోసీ(నో అబ్జక్షన్ సర్టిఫికేట్) ఇచ్చేందుకు రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే అధికారులు క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి ధ్రువీకరిస్తున్నారు. మరోవైపు కొంతమంది భూములు సాగు నీటిపరిధిలో లేకుండా సంబంధిత ఏఈలు సర్వే నంబరు మొత్తం నిలిపివేశారని ఆరోపిస్తున్నారు. సర్వే చేసేందుకు సిబ్బంది లేకపోవడం, ఎల్‌ఆర్‌ఎస్ గడువు ముగుస్తోందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మళ్లీ ప్లాట్ల యజమానుల అర్జీల మేరకు పునఃపరిశీలన చేస్తున్నారు. దీంతో ఎక్కడైనా పొరబాటుగా నమోదైతే తొలగిస్తున్నారు. అయితే ఆయా చోట్ల భూ యజమానులకు హోల్డ్‌లో ఉంటే తిప్పలు తప్పడం లేదు.
నిషేధిత భూములపై అభ్యంతరాలు
రెవెన్యూ, సాగునీటి పరిధిలో నిలిపివేత
‘ఎన్‌వోసీ’లకు భూ యజమానుల కష్టాలు
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు
ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్లాటు హాజీపూర్ మండలం సబ్బెపల్
ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్లాటు హాజీపూర్ మండలం సబ్బెపల్


