నస్పూర్: యాదవుల అస్థిత్వాన్ని దెబ్బతీసే విధంగా మంత్రి జూపల్లి కృష్ణారావు శాసనమండలిలో వ్యాఖ్యలు చేయడం సరికాదని యాదవ ఒగ్గు పూజారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాజనమేన శ్యాంకుమార్‌యాదవ్ అన్నారు. నస్పూర్–శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన సంఘం నాయకులతో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్య క్షేత్రం కొమురవెల్లి మల్లన్న ఆలయంతోపాటు శ్రీశైలం, వేలాల, గొల్లగట్టు జాతరలో పూజారులుగా యాదవులే ఉన్నారని పేర్కొన్నారు. మంత్రిని ఎవరో తప్పుదోవ పట్టించారని, ఆయన మాటలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. నాయకులు చింతల రాయమల్లు, ఏ.మల్లేశ్, పరిస ఐల య్య, ఎగ్గె రమేశ్, బాసవేన భానేష్, అంగ మల్లేశ్, పున్నం పోషన్న పాల్గొన్నారు.


