అప్పు కట్టినా..‘రుణం’ తీరలే! | - | Sakshi
Sakshi News home page

అప్పు కట్టినా..‘రుణం’ తీరలే!

Apr 1 2025 12:39 PM | Updated on Apr 1 2025 2:24 PM

అప్పు

అప్పు కట్టినా..‘రుణం’ తీరలే!

మంచిర్యాలఅగ్రికల్చర్‌: 2018 డిసెంబర్‌ నుంచి 2023 డిసెంబర్‌ 9 వరకు జిల్లాలో 94,200 మంది రైతులు వివిధ బ్యాంకుల్లో పంటరుణం తీసుకున్నా రు. జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 65,176 మంది రైతులకు పంట రుణ మాఫీ జరిగింది. రూ.2 లక్షల లోపు, ఆపైన రుణాలు తీసుకుని అ న్ని అర్హతలు ఉండి మాఫీకాని రైతులు జిల్లాలో 29 వేల మంది వరకు ఉన్నారు. చివరి నాలుగో విడత జాబితాలో కేవలం కొంతమంది రైతులకు మాత్ర మే లబ్ధి చేకూరింది. అన్ని అర్హతలు ఉండి అధికారులు సైతం వివరాలు నమోదు చేసుకున్నా మాఫీ కాకపోవడానికి గల కారణాలను తెలవడం లేదని రైతులు వాపోతున్నారు. పలుమార్లు బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా రు. అర్హత ఉన్నా తమకు ఎందుకు రుణమాఫీ కావడంలేదో అధికారులు చెప్పడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రెండు లక్షలలోపు రుణం ఉన్న రైతులతో పాటు ఆపైన రుణం తీసుకున్న రైతులు వడ్డీలు చెల్లించి ఆరునెలలుగా మాఫీకోసం ఎదురు చూస్తున్నారు. రెండు లక్షల వరకు ఉన్న అర్హులైన రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో త మకెందుకు మాఫీ కాలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీకి నిబంధనలు లేవంటూనే ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతూ మాఫీ చేయకుండా నీరుగార్చిందని రైతులు ఆరోపిస్తున్నారు.

జిల్లాలో 29 వేల మంది వరకు..

2018 డిసెంబర్‌ 12 నుంచి 2022 డిసెంబర్‌ 9 వరకు రూ.2 లక్షలలోపు రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ వర్తించేలా ప్రభుత్వం కట్‌ ఆఫ్‌ డేట్‌ విధించింది. జిల్లాలో ఈ గడువులోగా వివిధ బ్యాంకుల ద్వారా రుణం తీసుకున్న రైతులు 94,200 మంది వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రూ.1,258 కోట్ల మేర పంట రుణాలు తీసుకున్నారు. రుణమాఫీ ప్రక్రియలో భాగంగా జులై 16 నుంచి ఆగస్టు 15 వరకు మూడు విడతల్లో రుణమాఫీ అమలు చేసింది. ఆ తర్వాత డిసెంబర్‌లో నాలుగో విడుత రుణమాపీ నిధులు విడుదల చేసింది. మొత్తం నాలుగు విడుతల్లో 65,176 మంది రైతులకుగానూ రూ.550,72,67,585 మాఫీ జరిగింది. కుటుంబ నిర్ధారణ కానివారు, ఆధార్‌కార్డులో తప్పులున్నవారు, పంట రుణం తీసుకున్న ఖాతాపై ఒకపేరు, ఆధార్‌కార్డుపై మరోపేరు ఉన్నరైతులు, భర్త, భార్య పేరిట భూమి ఉండి ఇద్దరి పేరుతో రూ.2 లక్షలపైన తీసుకున్న రుణాలు, సరైన వివరాలు తేలని రైతుల పంట రుణాలు మాఫీ కాలేదు. నాలుగు విడతల్లో కూడా రుణమాఫీ కాని రైతులు వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేసి తమ రుణం మాఫీ కాలేదని మొర పెట్టుకుంటున్నారు. పలుమార్లు వ్యవసాయ అధికారులకు, బ్యాంకర్లకు, గ్రీవెన్స్‌లలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదని, తమ సమస్య పరిష్కారం కావడంలేదని వాపోతున్నారు.

ఆరు నెలలుగా ఎదురు చూసినా నిరాశే..

రూ. 2 లక్షల పైబడి రుణాలు ఉన్న రైతులకు మొండిచేయి

జిల్లాలో 29 వేల మంది వరకు మాఫీ లేనట్లే..

రుణమాఫీ కాలే.. రైతుభరోసా రాలే..

తెలంగాణ గ్రామీణ బ్యాంకులో నా పేరు మీద, నా భార్య పేరుమీద రూ.2లక్షల 15 వేల పంటరుణం తీసుకున్నా. ఐదు నెలల క్రితమే రూ.15 వేలు చెల్లించిన. ప్రభుత్వం రూ.2లక్షల వరకు రుణాలు మాఫీ చేసింది. కానీ నాకు మాత్రం మాఫీ కాలేదు.

– జాపాతి రాజన్న, నెన్నెల

మాఫీ లేదు..సాయం లేదు..

మా కుటుంబంలో నేనొక్కడినే తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.1.60 లక్షల పంటరుణం తీసుకున్నా. నాకు రేషన్‌కార్డు కూడా ఉంది. ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌పుస్తకంలో అన్నీ కరక్టుగానే ఉన్నాయి. అయినా నాకు రుణమాఫీ కాలేదు. చెన్నూర్‌ ఏవో ఆఫీసులో, కలెక్టర్‌ ఆఫీసులో ఫిర్యాదు చేసినా. ఇటు రుణమాఫీ కాలేదు. అటు పంట పెట్టుబడి సాయం అందలేదు..అప్పులు చేసి ఈయేడు పంటలు వేసుకున్నా.

– కస్తూరి మల్లయ్య, పొన్నారం, చెన్నూర్‌

అర్హులకు మాఫీ అయ్యింది..

రెండు లక్షల వరకు పంట రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ అయ్యాయి. నాలుగు విడతల్లో జిల్లాలో మొత్తం 65,176 మంది రైతులకు రుణమాఫీ జరిగింది. రూ.2 లక్షలకు పైన ఉన్న రైతుల రుణాల మాఫీకి సంబంధించి మాకు ఎలాంటి గైడ్‌లైన్స్‌ రాలేదు.

– కల్పన, జిల్లా వ్యవసాయ అధికారి

ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు ఆసంపల్లి రాజలింగు. మందమర్రి మండలంలోని సారంగపల్లి గ్రామానికి చెందిన ఇతను మందమర్రిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 2021లో రూ.70 వేల రుణం తీసుకున్నాడు. రుణం మాఫీ కావాలంటే వడ్డీ చెల్లించాలని బ్యాంకు అధికారులు చెప్పడంతో రూ.31వేలు కట్టాడు. ప్రభుత్వం నాలుగు విడతల్లో రైతుల రుణాలు మాఫీ చేసినా ఈ రైతు రుణం మాత్రం మాఫీ కాలేదు. కుటుంబంలో తానొక్కడినే పంటరుణం తీసుకున్నానని, అధికారులకు అన్నిపత్రాలు సమర్పించానని, అయినా తనరుణం ఎందుకు మాఫీ కావడంలేదని ఆందోళన చెందుతున్నాడు. ఇతనొక్కడే కాదు జిల్లాలో పలువురు రైతులదీ ఇదే పరిస్థితి.

జిల్లాలో రైతులు తీసుకున్న రుణాలు,

మాఫీ వివరాలు

విడతలు రైతులు (మాఫీ రూ.ల్లో)

మొదటి 29,127 153,43,69,814

రెండవ 14,680 141,95,12,055

మూడవ 13,244 176,74,42,650

నాలుగవ 8,195 78,59,43,066

మొత్తం 65,176 550,72,67,585

అప్పు కట్టినా..‘రుణం’ తీరలే!1
1/4

అప్పు కట్టినా..‘రుణం’ తీరలే!

అప్పు కట్టినా..‘రుణం’ తీరలే!2
2/4

అప్పు కట్టినా..‘రుణం’ తీరలే!

అప్పు కట్టినా..‘రుణం’ తీరలే!3
3/4

అప్పు కట్టినా..‘రుణం’ తీరలే!

అప్పు కట్టినా..‘రుణం’ తీరలే!4
4/4

అప్పు కట్టినా..‘రుణం’ తీరలే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement