సింగరేణి ఉద్యోగికి 552వ ర్యాంకు
మందమర్రిరూరల్: పట్టణానికి చెందిన దుర్గం క్రాంతి ఏరియాలోని శాంతిఖని గనిలో ఓవర్ మెన్‌గా ఉద్యోగం చేస్తూనే గ్రూప్–1కు ప్రిపేరయ్యాడు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో 452.5 మార్కులతో 552వ ర్యాంకు సాధించాడు. దుర్గం రమేశ్, సుజాత దంపతుల కుమారుడైన క్రాంతి పదోతరగతి వరకు స్థానిక లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో చదివాడు. గూడూరులో 2012 నుంచి 2015 వరకు మైనింగ్ డిప్లామా చేశాడు. 2016లో సింగరేణిలో నోటిఫికేషన్ వెలువడగా పరీక్షకు హాజరై ఓవర్‌మెన్ ఉద్యోగం సాధించాడు. విధులు నిర్వహిస్తూనే అంబేద్కర్ యూనివర్సిటీలో బీఏ, కాకతీయ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షలో ప్రతిభ కనబర్చాడు.


