పెరిగిన టోల్ చార్జీలు
● ఎన్‌హెచ్–363పై రూ.5నుంచి రూ.20వరకు పెంపు ● అర్ధరాత్రి నుంచే మందమర్రి, సరండి వద్ద అమలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఆర్థిక సంవత్సరం ము గియడంతో సోమవారం అర్ధరాత్రి నుంచి టోల్ చా ర్జీలు పెరగనున్నాయి. జాతీయ, రాష్ట్రీయ రహదా రుల్లో కొన్ని చోట్ల పెరిగే అవకాశం ఉండగా, మ రి కొన్ని చోట్ల తగ్గే అవకాశం ఉంది. మంచిర్యాల నుంచి చంద్రాపూర్ వెళ్లే జాతీయ రహదారి–363పై చా ర్జీలు పెరగనున్నాయి. ఈ జాతీయ రహదారి మ హారాష్ట్ర సరిహద్దు వరకు మొత్తం 94కిలోమీటర్లు ఉండగా, మంచిర్యాల జిల్లా మందమర్రి, ఆసిఫా బాద్ జిల్లా వాంకిడి మండలం సరండి వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఈ రెండు చోట్ల పెరిగిన ధరలు వ చ్చే ఏడాది మార్చి 31వరకు అమల్లో ఉంటాయి. ఇ క్కడి ట్రాఫిక్, నిర్వహణ తదితరవన్నీ లెక్కగట్టి ఎన్‌హెచ్ అధికారులు పెంపు రుసుం కోసం ప్రతిపాదనలు పంపగా, ఆమోదించారు. గతేడాదితో పోలిస్తే కనీసం రూ.10నుంచి రూ.20వరకు పెరిగాయి.


