బడి బ్యాంక్‌ జాడేది? | - | Sakshi
Sakshi News home page

బడి బ్యాంక్‌ జాడేది?

Apr 2 2025 12:58 AM | Updated on Apr 2 2025 1:00 AM

● అమలుకాని సంచయక పథకం? ● గతంలో పాఠశాలల్లో నిర్వహణ ● అమలు చేస్తే మేలంటున్న పోషకులు

అనవసర ఖర్చులు చేస్తున్నాం

పాఠశాలలో సంచాయక పథకం అమలులో లేకపోవడంతో మా తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులను అనవసర పనులకు ఖర్చు చేస్తున్నాం. దీంతో పొదుపు చేసుకునే అలవాటు లేకుండా పోతోంది.

– సోను, విద్యార్థి, వడ్యాల్‌ ఉన్నత పాఠశాల

పథకం అమలు చేయాలి

గతంలో పాఠశాలలో సంచాయక పథకం ఉండేదని, విద్యార్థులకు తమ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులను వృథా ఖర్చులు చేయకుండా పొదుపు చేసుకునే వారని మా ఉపాధ్యాయులు చెప్పారు. కానీ ఇప్పుడలా చేయడంలేదు. ప్రభుత్వం స్పందించి ఈ పథకం అమలయ్యేలా చర్యలు చేపట్టాలి.

– వైష్ణవి, విద్యార్థిని, పీచర ఉన్నత పాఠశాల

అమలైతే విద్యార్థులకు మేలు

గతంలో నేను పనిచేసిన పాఠశాలలో కిడ్డీ బ్యాంకులు ఏర్పాటు చేసి విద్యార్థులకు పొదుపు అలవాటు చేశా. కానీ ఇప్పుడు ఈ పథకం అమలులో లేకపోవడంతో మూలన పడింది. పథకం అమలైతే విద్యార్థులకు చిన్ననాటి నుండే దుబారా ఖర్చులు చేయడం మాని పొదుపు చేయడం అలవాటవుతుంది.

– రాజు నాయక్‌, ప్రధానోపాధ్యాయుడు, లక్ష్మణచాంద ఉన్నత పాఠశాల

లక్ష్మణచాంద(నిర్మల్‌): పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు పొదుపు అలవాటు చేసేందుకు గతంలో ప్రభుత్వం తీసుకువచ్చిన సంచయక పథకం ఉమ్మడి జిల్లాలోని ఏ పాఠశాలలోనూ అమలు కావడంలేదు. తల్లిదండ్రులు ఇంటి వద్ద తమపిల్లలు పాఠశాలలకు వెళ్లే సమయంలో ఇచ్చిన డబ్బులను ఎలా పొదుపు చేయాలి.. ఎంత వరకు ఖర్చు చేయాలి.. ఏ పనికి ఎంత ఖర్చు చేయాలి.. వంటి అంశంపై సంచాయక పథకం ద్వారా విద్యార్థులకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. పాఠశాలలో అమలు చేసే ఈ కార్యక్రమాన్ని జిల్లాస్థాయి అధికారులు పర్యవేక్షించాల్సి ఉంది. విద్యార్థులకు పొదుపుపై అవగాహన కల్పించడంతో పాటు వారితో పొదుపు చేయించేలా పోత్సహించే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రస్తుతం ఏ పాఠశాలలో ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో పథకం మూలనపడింది.

విద్యార్థుల్లో పొదుపు అలవర్చడమే లక్ష్యం...

తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న చిన్న ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులను చిరుతిండ్ల కోసం ఖర్చు చేస్తారు. దీంతో విద్యార్థులకు చిన్ననాటి నుండే అనవసర ఖర్చులు చేయడం అలవాటవుతుంది. ఇలాంటి దుబారా ఖర్చులు చేయకుండా సంచాయక పథకంలో భాగంగా ఆయా పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పోషకులు ఇచ్చిన డబ్బులను కిడ్డీ బ్యాంకులో జమ చేసేలా చేస్తారు. ఇందులో ఒక రూపాయి నుంచి మొదలు ఎంత వరకై నా జమ చేసుకునే వెసులుబాటు ఉంది. విద్యార్థి ఇంటి నుండి తెచ్చిన డబ్బులను రిజిస్టర్‌లో నమోదు చేసుకుని కిడ్డీ బ్యాంకులో వేస్తారు. అవసరం ఉన్నప్పుడు మళ్లీ రిజిస్టర్‌లో నమోదు చేసుకుని విద్యార్థి జమ చేసుకున్న డబ్బులు ఇస్తారు. ఇలా విద్యార్థులు సంవత్సరం పొడగునా జమ చేసిన పొదుపు డబ్బులను చివరన తీసుకునే అవకాశం ఉంది. అలాగే వచ్చే విద్యా సంవత్సరంలో మరింత మంది విద్యార్థులు కూడా ఇందులో డబ్బులను పోగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఒక విద్యార్థిని చూసి మరొక విద్యార్థి డబ్బులను పొదుపు చేసే అలవాటు నేర్పించడమే ఈ పథకం లక్ష్యం. కానీ ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ఏ ఒక్క పాఠశాలలో కూడా పథకం అమలు కావడం లేదు. దీంతో విద్యార్థులకు చిన్నతనం నుండి తమ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులను దుబారా ఖర్చులు చేస్తూ పొదుపు చేసే అలవాటుకు దూరం అవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సంచాయక పథకం అమలయ్యేలా చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఉమ్మడి జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల వివరాలు

జిల్లా ప్రాథమిక విద్యార్థులు ప్రాథమికోన్నత విద్యార్థులు ఉన్నత విద్యార్థులు మొత్తం

నిర్మల్‌ 577 23,398 89 6,373 164 37,019 67,790

మంచిర్యాల 511 13,678 97 4,234 108 23,442 41,354

కుమురంభీం 561 22,420 100 12,380 60 3,148 37,948

ఆదిలాబాద్‌ 500 – 119 – 120 – 65,000

బడి బ్యాంక్‌ జాడేది?1
1/3

బడి బ్యాంక్‌ జాడేది?

బడి బ్యాంక్‌ జాడేది?2
2/3

బడి బ్యాంక్‌ జాడేది?

బడి బ్యాంక్‌ జాడేది?3
3/3

బడి బ్యాంక్‌ జాడేది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement