లాడ్జిలో దాడికి పాల్పడిన వ్యక్తులు అరెస్ట్
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ గార్డెన్ సమీపంలోని ఓ లాడ్జిలో ఈనెల 1న రాత్రి జరిగిన దాడి కేసులో బుధవారం ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు స్థానిక సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం శ్రీరాంపూర్ భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఉషకోయల తరుణ్ తన బంధువులు శ్రావణ్, పర్వతాలు, శ్రీకాంత్, రేవంత్‌లు లాడ్జిలో రూమ్ తీసుకొని శ్రావణ్ కుటుంబ సమస్యపై మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో రేవంత్‌కు తెలిసిన వ్యక్తి అశోక్‌రోడ్‌కు చెందిన మురుమూరు సందీప్ తన స్నేహితులు తిగుళ్ల శివకుమార్, అబ్దుల్ అఫ్రోజ్, నిఖిల్, వివేక్, అచ్యుత్, సాకేత్‌లు రేవంత్‌తో పాటు ఇతరులపై దాడిచేశారు. పాత గొడవల కారణంగా సందీప్ రేవంత్‌పై దాడి చేయగా శ్రీకాంత్, తరుణ్, పర్వతాలుకు తీవ్ర గాయాలయ్యాయి. తరుణ్ ఫిర్యాదు మేరకు సందీప్, శివకుమార్, అబ్దుల్ అప్రోజ్, నిఖిల్, వివేక్, అచ్యుత్, సాకేత్‌లపై కేసు నమోదు చేయగా శివకుమార్, సాకేత్, అఫ్రోజ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిఖిల్, వివేక్, అచ్యుత్, సందీప్‌లు పరారీలో ఉన్నారన్నారు.


