భార్య, అత్తపై దాడి.. వ్యక్తి అరెస్ట్
తాండూర్: భార్య, అత్తను చితకబాది గాయపర్చిన కేసులో ఓ వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ మండలం అచ్చులాపూర్ గ్రామపంచాయతీ కొమ్ముగూడెం గ్రామానికి చెందిన దాగం మల్లేశ్ గతనెల 16న మద్యం తాగి భార్య లావణ్యతో గొడవ పడ్డాడు. లావణ్యపై దాడి చేయడానికి సిద్ధపడగా అత్త రాజు అడ్డుపడింది. కోపోద్రిక్తుడైన మల్లేశ్ గరిటెతో ఇరువురు తలలపై బలంగా కొట్టి గాయపర్చాడు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చినట్లు ఎస్సై తెలిపారు.
గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
నేరడిగొండ: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. నిర్మల్ వైపు గంజాయి తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు సిబ్బందితో కలిసి బుధవారం బంధం ఎక్స్‌రోడ్ వద్ద తనిఖీలు చేపట్టగా నేరడిగొండ మండలం వాంకిడి గ్రామానికి చెందిన షేక్ మజార్, నిర్మల్ జిల్లాకు చెందిన షేక్ ఇమ్రాన్ అనే ఇద్దరు వ్యక్తుల వద్ద 150 గ్రాముల గంజాయి లభించినట్లు తెలిపారు. వారిని విచారించగా నేరడిగొండ మండలంలోని ధన్నూర్(డి) గ్రామానికి చెందిన కాటరే తారాసింగ్ వద్ద నుంచి గంజాయి తీసుకొస్తున్నట్లు తేలిందన్నారు.
వ్యక్తి రిమాండ్
బజార్‌హత్నూర్: గంజాయితో ఉన్న వ్యక్తిని రిమాండ్‌కు తరలించిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మోర్కండి గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి పోలీస్‌పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో గులాబ్‌తండా గ్రామపంచాయతీ పరిధి ఇంద్రనగర్ గ్రామానికి చెంది న ఆడే రాజ్‌కుమార్ అనుమానాదస్పదంగా కన్పించాడు. అతడిని తనిఖీ చేయగా అతని వద్ద 100 గ్రాముల గంజాయి లభించింది. వెంటనే రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై అప్పారావు తెలిపారు. బుధవారం బోథ్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.


