రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల వాసి మృతి
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని రాంనగర్‌కు చెందిన పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ భర్త విజయ్ (53) బుధవారం హైదరాబాద్ రింగురోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం విజయ్ తన అన్న కూతురు సోనిని అమెరికా పంపించేందుకు ఈనెల1న అన్నయ్య రాములు, వదిన విజయ, మరో స్నేహితుడితో కలిసి తన కారులో వెళ్లాడు. బుధవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా రింగ్‌రోడ్డుపై కంటైనర్ లారీ ఢీకొనడంతో విజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అన్నయ్య రాములుకు, డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా రాములు భార్య విజయ తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోనే చికిత్స పొందుతోంది. విజయ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.


