ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
కోటపల్లి: మండలంలోని కొండంపేట గ్రామ సమీపంలో ఉపాధి హామీ పథకం కూలీలపై బుధవారం తేనెటీగలు దాడి చేశాయి. కూలీలు అటవీ ప్రాంతంలో పని ప్రదేశానికి వెళ్తుండగా ఒక్కసారిగా దాడి చేయడంతో పరుగులు తీశారు. తేనెటీగల నుంచి తప్పించుకునేందుకు తలోవైపు పరుగు పెట్టారు. దాడిలో గ్రామానికి చెందిన లింగయ్య, బానయ్య, రాజు, సమ్మక్క, అంకమ్మ, బాపు స్వల్పంగా, పి.స్వరూప తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి బాధితులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యుడు సత్యనారాయణకు సూచించారు. దాడిలో కూలీల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.


