పదోన్నతితో గౌరవం, బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పదోన్నతితో గౌరవం, బాధ్యత

Apr 3 2025 12:57 AM | Updated on Apr 3 2025 12:57 AM

పదోన్నతితో గౌరవం, బాధ్యత

పదోన్నతితో గౌరవం, బాధ్యత

మంచిర్యాలక్రైం: పోలీసు ఉద్యోగికి పదోన్నతి గౌరవాన్ని, బాధ్యతను పెంచుతుందని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. రామగుండం పోలీసు కమిషనరేట్‌లో పని చేస్తున్న 51మంది కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించిన సందర్భంగా చిహ్నాలను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎలాంటి రిమార్క్‌ లేకుండా విధులు నిర్వర్తించాలని అన్నారు. వి ధుల్లో ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు, రివార్డులు అందిస్తామని తెలిపారు. ప్రజలతో సత్సంబంధాలు ఏర్పర్చుకుని నేర నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ రాజు, ఎస్‌బీ ఏసీపీ రఘవేంద్రరావు, ఏఓ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement