అన్ని దానాలకన్నా రక్తదానం గొప్పది..
జైపూర్: అన్ని దానాలకన్నా రక్తదానం చాలా గొప్పదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెగా రక్తదా న శిబిరం నిర్వహించారు. బీజేవైఎం, ఎమ్మార్పీఎస్ యువత, ఛత్రపతిశివాజీ యువసేన యువకులు రక్తదానం చేశారు. మంచిర్యాల రె డ్‌క్రాస్ సొసైటీ నిర్వాహకులు కాసర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రక్తాన్ని సేకరించారు. రక్తదానం చేసిన యువతకు బీజేపీ నాయకులు పండ్లు అందజేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, పార్టీ మండల అధ్యక్షుడు దూట రాజ్‌కుమార్, కోట పల్లి మండల ఇంచార్జి కాసెట్టి నాగేశ్వర్‌రావు, నాయకులు రాంటెంకి సాయి, సుమన్, యువకులు పాల్గొన్నారు.


