● ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 11 మందికి ముగ్గురే.. ● వివ
నియామకానికి ప్రయత్నిస్తున్నాం
మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు 11 మంది ఉండాలి. అందులో ఒకరు బ్లడ్‌బ్యాంకుకు పనిచేస్తే, మిగతా 10 మంది అ త్యవసర విభాగంలోనే పనిచేయాల్సి ఉంటుంది. ముగ్గురు ఉద్యోగులు ఉన్నా పలు కారణాలతో సెలవులో, ఇతర విభాగాల్లో వెళ్లి పనిచేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎస్‌ఆర్‌లకు, ఇతర వైద్య నిపుణులకు సీఎంవోగా విధులు అప్పగించాల్సి వస్తోంది. ఇ ప్పటికే పలుమార్లు నోటిఫికేషన్ వేసినా ఎ వరూ ముందుకు రావడం లేదు. ఖాళీలు భర్తీ చేసి సీఎంవోల కొరతను తీర్చి రోగుల కు చికిత్స అందించేలా చూస్తాం.
– డాక్టర్ హరీశ్‌చంద్రరెడ్డి, మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రం మంచిర్యాలలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అత్యవసర విభాగంలో క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్(సీఎంవో) వైద్యులు కరువయ్యారు. జిల్లాతోపాటు కుమురంభీం ఆసిఫా బాద్ జిల్లా, పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి నిత్యం వందలాది మంది రోగులు ఆస్పత్రికి వస్తుంటారు. అత్యవసర విభాగానికి వచ్చే వారిలో రోడ్డు ప్రమా ద క్షతగాత్రులు, ఆత్మహత్యాయత్నం చేసిన వారు, గొడవల్లో గాయపడిన వారు ఉంటారు. ఇలాంటి కేసులు ప్రతీ రోజు 10నుంచి 15వరకు వస్తుంటా యి. నెలలో 300కు పైగా ఇలాంటి కేసులే వస్తుండడంతో ఆయా రోగులకు అత్యవసర వైద్యం అందించి, అనంతరం అవసరమైన ప్రత్యేక వైద్య నిపుణుల వద్దకు రెఫర్ చేయాల్సిన బాధ్యత సీఎంవోలపై ఉంటుంది. కానీ అత్యవసర సమయంలో వైద్యంచే వారు లేకపోవడంతో ఇబ్బందిగా మారుతోంది.
పేరుకే ముగ్గురు సీఎంవోలు
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 11 మంది క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు ఉండాలి. కానీ ముగ్గురు మాత్రమే ఉండగా, వారిలో ఒకరు మెటర్నిటీ లీవ్‌లో, మరొకరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వెళ్లిపోవడంతో ఒక్కరే మిగిలారు. ప్రతీరోజు 10 నుంచి 15 అత్యవసర కేసులు వస్తుండడం, 24 గంటలు అందుబాటులో ఉండాల్సిన చోట మూడు షిఫ్టులకు ఒక్కరే పనిచేయడం కష్టంగా మారుతోంది. దీంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి వచ్చిన సీనియర్ రెసిడెంట్ల(ఎస్‌ఆర్)కు సీఎంవో విధులు అప్పగించారు. రెగ్యులర్‌గా ఉండే ఒక్క ఉద్యోగి అనారోగ్య కారణంతో సెలవుపై వెళ్లడం, ఎస్‌ఆర్‌లు మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేసేందుకు ఉన్న గడువు గత నెల 31వ తేదీతో ముగిసిపోయింది. ఒక్కరు కూడా అందుబాటులో లేరు. దీంతో మెడికల్ కాలేజీకి అనుబంధంగా కొనసాగుతున్న ఆసుపత్రి ఇతర విభాగాల్లో పనిచేస్తున్న వైద్య నిపుణులు, మెడికల్ కాలేజీ ఫ్యాకల్టీలకు సీఎంవోగా అదనపు బాధ్యతలు అప్పగించాల్సి వస్తోంది. దీనిపై వారంతా కలిసి ఈ నెల 1న తమకు సీఎంవో బాధ్యతలు అప్పగించవద్దంటూ నిరసన వ్యక్తం చేశారు.
● ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 11 మందికి ముగ్గురే.. ● వివ
● ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 11 మందికి ముగ్గురే.. ● వివ


