మాలగురిజాలకు కిడ్నీ గండం!
గ్రామ స్వరూపం
జనాభా 1,684
సీ్త్రలు 846
పురుషులు 838
నివాసాలు 435
చేతిపంపులు 06
వాటర్ ట్యాంకులు 02
పంపు మోటార్లు 03
ఈ ఫొటోలోని వ్యక్తి పేరు రత్నం పెద్ద బాపు. 66 ఏళ్ల వయస్సు ఉన్న ఆయన నాలుగున్నరేళ్ల క్రితం కిడ్నీ వ్యాధి బారిన పడ్డాడు. రెండు కిడ్నీలు పరిమాణం తగ్గి చురుగ్గా పని చేయడం మానేశాయి. ఏడాది క్రితం డయాలసిస్ చేయాల్సిన అవసరం ఏర్పడగా శరీరం సహకరించదేమోనని భయపడి వెనుకంజ వేశాడు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ వైద్యుడి వద్దకు వెళ్లి ప్రతీ నెల చికి త్స చేయించుకుంటున్నాడు. మందులు వాడు తూ కాలం వెళ్లదీస్తున్నాడు. నెలకు గరిష్టంగా రూ.5 వేల వరకు ఖర్చు చేస్తున్నాడు.
ఈ ఫొటో కనిపిస్తున్న మహిళ పేరు రత్నం రాజక్క. 64 ఏళ్ల వయస్సు కలిగిన ఈమె గత ఆరు నెలల నుంచి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతోంది. రెండు కిడ్నీల్లో ఒకటి బాగానే ఉన్నా మరొకదాని పనితీరు మందగించింది. ఆమెకు డయాలసిస్ చేయించుకునే పరిస్థితి ఇంకా రానప్పటికీ ప్రతీ నెల మందులు వాడాల్సి వస్తోంది. ఈమె కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ వైద్యుడికి వెళ్లి చికిత్స చేయించుకుంటోంది. నెలకు ప్రయాణ ఖర్చులు కలుపుకొని గరిష్టంగా రూ.4 వేల వరకు ఖర్చవుతోంది.
మృతులు..
కిడ్నీ సమస్యలతో గ్రామంలోని ఒకే ఇంటికి చెందిన కలాలి చిన్నరాజం, అంకుబాయి ఐదేళ్ల క్రితం మృతిచెందారు. వీరితోపాటు మరో కుటుంబానికి చెందిన గోలేటి పోశం, ఆయన కొడుకు గోలేటి శంకర్ కిడ్నీ జబ్బుల బారిన పడి మూడేళ్ల క్రితం చనిపోయారు. మరో ఇంట్లో అక్కాచెల్లెళ్లు గోమాస రాజుబా యి, కొండగొర్ల అనసూర్య ఏడాదిలోపు, వీరి తమ్ముడు దాగం మల్లేష్ కిడ్నీలు పాడైపోయి ఆరేళ్ల క్రితం తనువు చాలించారు.
బెల్లంపల్లి: కిడ్నీ వ్యాధులతో ఆ గ్రామంలో ఇంటింటా మరణమృదంగం మోగుతోంది. యేటా ఒకరిద్దరు చనిపోతుండగా.. మరికొందరు మృత్యువుతో పోరాడుతుండడం కనిపిస్తోంది. తాగునీటి సమస్యే కారణమో.. మరేదో తెలియదు గానీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. బెల్లంపల్లి పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని మాలగురిజాల గ్రామం కిడ్నీ సమస్యలకు నెలవుగా మారింది. గత ఐదేళ్లలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో 20మంది వరకు చనిపోగా.. పలువురు అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఒక్కో ఇంట్లో ఇద్దరు
గ్రామంలోని ఒక్కో ఇంట్లో ఇద్దరు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఆడామగ తేడా లేకుండా వ్యాధి బారి న పడుతున్నారు. 35ఏళ్ల నుంచి 70ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తులు కిడ్నీలు పనిచేయకుండా సతమ తం అవుతున్నారు. ఒక్కో ఇంట్లో తండ్రి లేదా కొడు కు లేదా తల్లి కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడి డయాలసిస్ స్థితికి చేరుకుంటున్నారు. కుటుంబ పెద్దలు జబ్బు బారిన పడి మంచానికి పరిమితం కావడంతో కుటుంబ బాధ్యతలు అనివార్యంగా ఇల్లాలిపై పడుతున్నాయి. పిల్లలు వేరే ప్రాంతాల్లో ఉన్న వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. వ్యవసాయదారులు, కూలీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి పక్షం రోజులకోసారి కొందరు, నెలరోజులకోసారి మరికొందరు డయాలసిస్ చేయించుకుంటున్నారు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో గోలేటి సాలక్క డయాలసిస్ చేయించుకుంటోంది. డయాలసిస్ చేయించుకోవాలని మరో వ్యక్తికి వైద్యులు సూచించినా భయంతో మాత్రలతో నెట్టుకొస్తున్నాడు. బోరునీటిని తాగడం వల్లనే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడం, ఇతర వ్యాధుల బారిన పడుతున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నా తాగడానికి ఇష్టపడడం లేదు. అంతకు కొన్నేళ్ల ముందు రక్షిత మంచినీటి పథకం ద్వారా నీటి సరఫరా చేశారు. కానీ గ్రామస్తులంతా బోరు నీరు తాగడానికి అలవాటు పడడంతో ఒక్కొక్కరుగా కిడ్నీ సంబంధిత సమస్యలు కొని తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
నీటి సమస్యతోనే జబ్బులు
గ్రామంలో చాలా ఏళ్ల నుంచి బోరు నీళ్లనే తాగుతున్నం. రుచికరంగా ఉండడంతో తాగడానికి ఇష్టపడుతున్నం. ఎందుకో, ఏమో తెలియదు కానీ ఆరోగ్యంగా కనిపిస్తూనే ఒక్కసారిగా ఒక్కొక్కరు కిడ్నీలు పాడైపోయి మంచం పడుతున్నారు. నీళ్ల కారణంగానే కిడ్నీ జబ్బులు వస్తున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి.
– రత్నం లింగయ్య, గ్రామస్తుడు
చనిపోతున్నారు..
కిడ్నీ సమస్యలు వచ్చి గ్రా మంలో చాలామంది చని పోతున్నారు. పలువురు కిడ్నీ సమస్యలతో సతమ తం అవుతున్నారు. వ్యాధి ముదిరాక కానీ బయట పడడం లేదు. దీంతో అనేక మంది ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఏటా కొంతమంది చనిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. కిడ్నీల సమస్యలు ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– దుగుట తిరుపతి, మాజీ సర్పంచ్
సమగ్ర సర్వే చేయిస్తాం..
కిడ్నీల సమస్యలు ఏర్పడడానికి పలు రకాల కారణాలు దోహదపడతాయి. గ్రామంలో ఎలాంటి నీరు తాగుతున్నారనేది గర్తించాల్సి ఉంది. కిడ్నీ జబ్బుల బారిన పడుతున్న వ్యక్తుల్లో ఎంతమంది డయాబెటిక్ పెషెంట్స్, మ రెంతమందికి మద్యం తాగే అలవాటు ఉందనేది గుర్తించాల్సి ఉంది. నిపుణులైన వైద్యులతో విశ్లేషణ చేయిస్తే కా నీ కిడ్నీ సమస్యలు ఎందుకు ఏర్పడుతున్నాయో నిర్ధారించలేం. ముందస్తుగా గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చే యించి రోగులకు వైద్యసేవలు అందించే విధంగా చూ స్తాం. ఓ మారు గ్రామంలో సమగ్ర సర్వే చేయించి కిడ్నీ సమస్యల నిర్ధారణ, నివారణకు చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ హరీష్‌రాజ్, డీఎంఅండ్‌హెచ్‌ఓ, మంచిర్యాల
మాలగురిజాలకు కిడ్నీ గండం!
మాలగురిజాలకు కిడ్నీ గండం!
మాలగురిజాలకు కిడ్నీ గండం!
మాలగురిజాలకు కిడ్నీ గండం!


