చికిత్స పొందుతూ మహిళ మృతి
సారంగపూర్: మండలంలోని ధని గ్రామానికి చెందిన పంబాల లక్ష్మి (46) అనే మహిళ నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం పంబాల లక్ష్మి, భర్త గంగాధర్‌తో కలిసి బుధవారం ద్విచక్రవాహనంపై నిర్మల్ వైపు వెళ్తుండగా ధని గ్రామ సమీపంలోని హనుమాన్ ఆలయం మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి జారిపడి తీవ్ర గాయాలపాలైంది. వెంటనే 108లో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.


