బొగ్గు గనుల వేలంలో పాల్గొనవద్దు
శ్రీరాంపూర్: కేంద్రం తీసుకొచ్చిన బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనవద్దని, తద్వారా బొగ్గు పరిశ్రమపై తన హక్కును క్రమేణా కోల్పోతుందని ఏఐఎఫ్‌టీయూ నాయకులు తెలిపారు. గురువారం ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి జీ అంజయ్య, కార్యదర్శి మేకల పోశమల్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్‌లు నస్పూర్ –శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లోని సహజ సందపను దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను కాల్చి చంపుతుందని పేర్కొన్నారు. ఇతర ప్రజాసమస్యలపై చర్చించేందుకు ఈనెల 5న మంచిర్యాల పట్టణంలోని చార్వాక ట్రస్ట్‌భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ రాములు, నాయకులు రాజ్‌కుమార్, పీఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు లావణ్య, నాయకులు దుర్గయ్య, యాకయ్య పాల్గొన్నారు.


