బైక్‌లో దూరింది.. హడలెత్తించింది!
నిర్మల్‌ఖిల్లా: ద్విచక్రవాహనంలో దూరిన విషసర్పం కొన్ని గంటలపాటు హడలెత్తించింది. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రం సమీపంలోని ముక్టాపూర్ సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహించే ఉద్యోగి సాగర్‌కు చెందిన బైక్ డోమ్‌ను ఆనుకొని నాగుపాము దాక్కుంది. బయటకు వెళ్లేందుకు యజమాని బైక్ స్టార్ట్ చేయగా అందులో దాగి ఉన్న విషసర్పం కన్పించడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. వెంటనే స్నేక్ క్యాచర్ గిరిగంటి వినీల్‌కు సమాచారం అందించారు. ఆయన అక్కడకు చేరుకుని చాకచక్యంగా ప్రాణాలతోనే పామును పట్టుకున్నాడు. పాముకు హాని కలిగించకుండా సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


