ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు

Apr 7 2025 1:20 AM | Updated on Apr 7 2025 1:20 AM

ఘనంగా

ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు

మంచిర్యాలటౌన్‌/చెన్నూర్‌: భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు చెన్నూర్‌లోని తన స్వగ్రామంలోనూ ఆయన జెండా ఎగురవేశారు. జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి మంచిర్యాల పట్టణంలోని అర్చన టెక్స్‌ చౌరస్తా వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజ్‌కుమార్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ గాజుల ముఖేశ్‌గౌడ్‌, నాయకులు దుర్గం అశోక్‌, పరుషోత్తం జాజు, పెద్దపల్లి పురుషోత్తం, జోగుల శ్రీదేవి, వంగపల్లి వెంకటేశ్వర్‌గౌడ్‌, బోయిని హరికృష్ణ, కర్రె లచ్చన్న, మల్యాల శ్రీనివాస్‌, తోట మల్లికార్జున్‌, దేవరకొండ వెంకన్న పాల్గొన్నారు. చెన్నూర్‌ బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు జాడి తిరుపతి ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు.నాయకులు కేవీఎం.శ్రీనివాస్‌, బత్తుల సమ్మయ్య, శ్రీపాల్‌, దాసరి రాజన్న తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు1
1/1

ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement