క్రికెట్ పోటీలు ప్రారంభం
నస్పూర్: సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని గనుల కార్మిలకు ఏఐటీయూసి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను స్థానిక నాయకులు ఆదివారం నిర్వహించారు. యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కె సమ్మయ్య, ఏరియా కార్యదర్శి బాజీసైదా పోటీలు ప్రారంభంచి మాట్లాడారు. త్లాళపల్లి మాజీ సర్పంచ్ సీపీఐ నాయకుడు పి.నర్సయ్య స్మారకార్ధ ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కృష్ణాకాలనీలోని శాంతి స్టేడియంలో జరిగిన పోటీలలో ఆర్‌కే–5 గని కార్మికులు పోటీలలో పాల్గొన్నారు. బ్రాంచి ఉపాధ్యక్షుడు కొట్టె కిషన్‌రావు, నాయకులు సకినాల నర్సయ్య, నర్సింగరావు, సురేష్, అఫ్రోజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.


