నేటి నుంచి ఎస్‌ఏ–2 పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎస్‌ఏ–2 పరీక్షలు

Apr 9 2025 12:12 AM | Updated on Apr 9 2025 12:12 AM

నేటి నుంచి ఎస్‌ఏ–2 పరీక్షలు

నేటి నుంచి ఎస్‌ఏ–2 పరీక్షలు

మంచిర్యాలఅర్బన్‌: జిల్లాలో బుధవారం ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సంగ్రహణాత్మక మూల్యాంకన(ఎస్‌ఏ–2) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17వరకు కొనసాగుతా యి. ఒకటి నుంచి 7వ తరగతులకు ఉదయం 9గంటల నుంచి 11.30గంటల వరకు, 8వ తరగతికి ఉదయం 9గంటల నుంచి 11.45గంటల వరకు, తొమ్మిదో తరగతికి ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తా రు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు ప్రశ్నపత్రాల ను అన్ని పాఠశాలలకు పంపిణీ చేశారు. 6నుంచి 9వ తరగతి ప్రశ్నపత్రాలను ఎంఆర్‌సీ, కస్టోడియన్‌ హైస్కూల్‌లో అందుబాటులో ఉంచారు. ప్రధానో పాధ్యాయులు ఏ రోజు ప్రశ్నపత్రాలను ఆరోజు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రాలను పాత పద్ధతిలో ప్రధానోపాధ్యాయుల వద్ద భద్రపర్చాలని, మండలానికి కేంద్రం ఏర్పాటు వల్ల రవాణాలో ఇబ్బందులు ఏర్పడుతాయని ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డీఈవో యాదయ్యకు వినతిపత్రం అందజేశారు.

హాల్‌టికెట్లు పంపిణీ

పది పరీక్షల మాదిరిగా జన్నారం మండలం తపాలపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులకు హాల్‌టికెట్లు పంపిణీ చేశారు. జబ్లింగ్‌ విధానంలో బెంచీలు కేటాయించారు.

మాస్‌కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు

ప్రశ్నపత్రాల లీకేజీ, మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన ఉపాధ్యాయులు, పాఠశాలలపై శాఖపరమైన చర్యలుంటాయి. ప్రైవేట్‌ పాఠశాలల గుర్తింపు రద్దు చే స్తాం. విద్యాసంవత్సరం ముగింపు రోజు ఈ నెల 23న తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించి వి ద్యార్థులకు ప్రగతి పత్రాలు అందజేయాలి. ప్రశ్నపత్రాల సమాచారం కోసం డీసీఈబీ సహాయ కార్యదర్శి 9490092767 నంబరులో సంప్రదించాలి.

– డీఈవో యాదయ్య

తరగతి బాలురు బాలికలు విద్యార్థుల సంఖ్య

6నుంచి 9వ తరగతి వరకు

1 6004 5496 11500

2 5184 4802 9986

3 5249 4865 10114

4 5773 5480 11253

5 5259 4702 9961

6 5865 5411 11276

7 5693 5300 10993

8 5584 5120 10704

9 5235 5016 10251

మొత్తం 49846 46192 96038

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement