ఆర్జీయూకేటీకి ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్
● రూ.15 లక్షల చెక్కు అందించిన గవర్నర్ జిష్ణుదేవ్
బాసర: బాసర ఆర్జీయూకేటీలో ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు గవర్నర్ జిష్ణుదేవ్ బుధవారం ఆర్జీయూకేటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్‌కు రాజ్‌భవన్‌లో రూ.15 లక్షల చెక్కును అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రగతి అవకాశాలను వినియోగించుకునేలా వినూత్న పారిశ్రామిక ఆలోచనల ఏర్పాటే లక్ష్యంగా ఈ సెంటర్ పని చేయనుంది. తదనుగుణంగా గవర్నర్ జిష్ణుదేవ్ ఆర్జీయూకేటీలో ఇటీవల జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకుంటున్న చర్యలు, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళిక, వివిధ సంస్కరణలను ప్రశంసించారు. ఈ సందర్భంగా వీసీ గోవర్ధన్ గవర్నర్ జిష్ణుదేవ్‌కు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు.


