ప్రమాదాలు పునరావృతం కావొద్దు●
శ్రీరాంపూర్: సింగరేణిలో ప్రమాదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీఎంఎస్) ఎన్.నాగేశ్వర్‌రావు సూచించారు. బుధవారం సీసీసీలోని సింగరేణి గెస్ట్‌హౌజ్ కాన్ఫరెన్స్ హాల్‌లో బెల్లంపల్లి రీజియన్‌లోని భూగర్భ గనుల్లో రూఫ్ ప్రమాదాలు, రక్షణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన ప్రమాదాలపై విచారణ జరిపి మరో సా రి అలా జరుగకుండా చూడాలన్నారు. రూఫ్ ప్రమాదాల నివారణకు కొత్త టెక్నాలజీని వాడుకోవాలన్నారు. ఇన్‌డ్యూస్ బ్లాస్టింగ్‌లో తగు జాగ్రత్తలు తీ సుకోవాలన్నారు. సీఎంఆర్ 2017 కోల్‌మైన్స్ రూల్స్‌ను పాటిస్తూ సపోర్టింగ్ చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ప్రేంకుమార్, కార్పొరేట్ సేఫ్టీ జీఎం చింతల శ్రీనివాస్, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం కే.రఘుకుమార్, శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్, మందమర్రి జీఎం దేవేందర్, బెల్లంపల్లి జీఎం విజయ భాస్కర్‌రెడ్డి, ఏరియా సేఫ్టీ అధికారులు శ్రీధర్‌రావు, రాయమల్లు, ఏజెంట్లు రాజేందర్, శ్రీధర్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.


