తాగునీటి సరఫరాలో విఫలం
చెన్నూర్: చెన్నూర్ పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరాలో గత, ప్రస్తుత ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. పట్టణంలోని చోట హనుమాన్ మందిర్‌లో గురువారం ప్ర త్యేక పూజలు చేసి గావ్‌చలో బస్తీ చలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అ మలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నూర్‌లో 12 ట్యాంక్‌లున్నా ఒక్క ట్యాంక్ నుంచి బిందెడు నీళ్లు రావడం లేదని ఆరోపించారు. గోదావరి నది నుంచి రోజు వందలాది లారీల ఇసుక తరలిపోతోందని, స్థానిక అవసరాలకు ఇవ్వడం లేదని తెలిపారు. స్థాని కులకు గోదావరి ఇసుక ఇచ్చే విధంగా ఎమ్మె ల్యే చొరవ చూపాలని తెలిపారు. మున్సిపల్ కార్యాలయానికి కాంపౌండ్ వాల్ నిర్మించుకోలేదని దుస్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు జాడి తిరుపతి, బ త్తుల సమ్మయ్య, గర్రెపల్లి నర్సయ్య, రాపర్తి వెంకటేశ్వర్, కేవీఏం శ్రీనివాస్, కమ్మల శ్రీని వాస్, తుమ్మ శ్రీపాల్, స్వరూపారాణి, ఏతం శివకృష్ణ పాల్గొన్నారు.


