సేఫ్టీ కమిటీ సమావేశం బహిష్కరణ
భీమారం: జైపూర్ మండలం ఐకే 1ఏ గనిలో శుక్రవారం నిర్వహించిన స్టేఫ్టీ కమిటీ సమావేశాన్ని ఫిట్ స్టేఫ్టీ కమిటీ సభ్యులు బహిష్కరించారు. ఈ మేరకు కమిటీ కార్యదర్శి నవీన్‌రెడ్డి నేతృత్వంలో గని మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ గతంలో సేఫ్టీ కమిటీ సభ్యుల సూచనలు అమలు చేయకుండా ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. భద్రతపై దృష్టి సారించి ప్రమాదరహిత గనిగా మార్చాలని డిమాండ్ చేశారు. గనిలో ప్రమాదాలు జరిగినప్పుడు యాజమాన్యం ప్రమాదస్థలానికి వెళ్లి జరిపే విచారణ కమిటీల్లో సేఫ్టీ కమిటీ సభ్యులను భాగస్వాములను చేయాలని అన్నారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కార్మికులకు సస్పెండ్, చార్జిషీట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించినట్లు తెలిపారు. కమిటీ సభ్యులు సత్తయ్య, వెంకటస్వామి, రాజగోపాల్, ప్రశాంత్ పాల్గొన్నారు.


