కేంద్ర మంత్రికి రిటైర్డ్ కార్మికుల వినతి
శ్రీరాంపూర్: కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డికి సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నా యకులు వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్‌లో ఆదివారం మంత్రిని కలిశారు. సీఎంపీఎఫ్ శాఖ లో జరుగుతున్న లోపాలను వివరించారు. రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంపుదల చేయాలని కోరారు. రిటైర్డ్ కార్మికులు చాలీచాలని పెన్షన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో సింగరే ణి రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.వా సుదేవరావు, ప్రధాన కార్యదర్శి జేవీ.దత్తాత్రేయులు, కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్‌సీ బాపురెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.బాబురావు, ఉ ప ప్రధాన కార్యదర్శి ఆళవేందార్ వేణుమాదవ్, నా యకులు శ్రీధర్‌రావు, పులి రాజిరెడ్డి పాల్గొన్నారు.


