నేడు డిప్యూటీ సీఎం, మంత్రుల రాక
మంచిర్యాలటౌన్: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ సోమవా రం జిల్లాలో పర్యటించనున్నారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి ఆదివారం మాట్లాడారు. ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం హెలికాప్టర్‌లో మంచిర్యాల చేరుకుంటారని తెలిపారు. 11:15 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా కేంద్రంలో పర్యటిస్తారన్నారు. ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ, రాళ్లవాగు వద్ద కరకట్ట నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని వివరించారు. అనంతరం మాతా శిశు, సూపర్ స్పెషాలి టీ ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలిస్తారన్నారు. తర్వాత ఓపెన్ టాప్ జీప్‌లో ఐబీ చౌరస్తా నుంచి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానం వరకు ర్యాలీ ఉంటుందని తెలిపారు.
బహిరంగ సభ..
జెడ్పీ మైదానంలో జరిగే బహిరంగ సభలో మంత్రులు కొత్త పథకాలు ప్రకటిస్తారని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని ఎమ్మెల్యే వెల్ల డించారు. సభకు 40 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేశామన్నారు. డంప్‌యార్డు సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందన్నారు. వేంపల్లిలో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు ఖాయమన్నారు. మంగళవారం నుంచి మహాప్రస్థానం అందుబా టులోకి వస్తాయని పేర్కొన్నారు. నిరుపేదలకు ఉచితంగా అంత్యక్రియలు, డెత్ సర్టిఫికె ఇస్తామని తెలిపా రు. మంచిర్యాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు కోసం తాను నిరంతరం కృషి చే స్తున్నానని, కాంగ్రెస్ కార్యకర్తలు క్రమశిక్షణతో సభను విజయవంతం చేయాలని కోరారు.


